ఇది నిజంగా జగన్‌కు బ్యాడ్ న్యూస్..?
వన్ నేషన్ -వన్ ఎలక్షన్ బిల్లుపై లోక్ సభలో ఓటింగ్ నిర్వహించారు. తొలిసారిగా ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటింగ్ చేపట్టారు. సాంకేతిక సమస్యలున్న చోట, అలాగే అడిగిన సభ్యులకు స్లిప్పులను అందించి జేపీసీ అంశంపై ఓటింగ్ కొనసాగించారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్ వాల్ ప్రవేశ పెట్టిన జమిలి ఎన్నికల బిల్లుకు ఎన్డీఏ పక్షాలు మద్ధతు తెలిపాయి. విపక్షాలు వ్యతిరేకించాయి.అనుకూలంగా 269 ఓట్లు వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని వైసీపీ, టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలు జమిలి ఎన్నికలకు తమ మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించింది.జమిలి బిల్లును కాంగ్రెస్, సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించారు.జమిలి బిల్లు ప్రవేశపెట్టడాన్ని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) వ్యతిరేకించింది. జమిలి బిల్లును శివసేన (ఉద్దవ్ బాల్ ఠాక్రే) పార్టీ కూడా వ్యతిరేకించింది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ పొందాల్సి ఉంటుంది.

అయితే మూడింట రెండు వంతుల మెజారిటీ లేకపోవడంతో వన్ నేషన్ -వన్ ఎలక్షన్ బిల్లు పాస్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇది ఎవరికి ఎలా ఉన్నా, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు మాత్రం ఇది నిజంగా చేదువార్తే అని చెప్పాలి. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది.ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక , కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది జగన్ పార్టీ. కూటమి దెబ్బకు వైసీపీ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడంతో నాయకులు ఒకొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. దీంతో జమిలి ఎన్నికలపై జగన్ బోలేడు ఆశలు పెట్టుకున్నారు.కానీ ప్రస్తుత పరిస్థితిని చూస్తూంటే ఇప్పట్లో జమిలి ఎన్నికలు జరిగేలా కనిపించడం లేదు.దీన్ని బట్టి చూస్తే 2029 లోనే తిరిగి ఎన్నికలు జరిగేలా కనిపిస్తోంది. ఇది నిజంగా జగన్‌కు బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి.












Click it and Unblock the Notifications