జోష్ లో జగన్ .. పీకే కు బంపర్ ఆఫర్ ఇచ్చారుగా !
Recommended Video
ఏపీలో ఎన్నికల వ్యూహకర్త, జగన్ పార్టీ గెలుపు కోసం గత మూడేళ్ళుగా పని చేసిన ప్రశాంత్ కిశోర్ కి... ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది . అయితే... జగన్ ఇచ్చిన ఆఫర్ ని ప్రశాంత్ కిశోర్ ఓకే చేశారా లేదా అన్నదే తెలియాల్సి వుంది. ఇంతకీ జగన్ పీకే కు ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా .

జగన్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించటానికి తోడ్పాటునందించారు ప్రశాంత్ కిషోర్
2014 ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఇచ్చిన జగన్ పార్టీ ఈ సారి ఎనికల్లో విజయం సాధించటానికి వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. అలా వ్యూహాత్మకంగా వ్యవహరించటంలో వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎంతగానో తోడ్పాటునందించారు. ఇటీవల ఏపీ ఎన్నికలలో హోరాహోరీగా ప్రధాన పార్టీలు తలపడిన విషయం అందరికీ తెలుసు . హోరాహోరీగా జరిగిన ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఫలితాలు రావడానికి మాత్రం ఈ నెల 23వ తేదీ వరకు ఆగాల్సి ఉంది. ఈ దఫా ఎన్నికల కోసం జగన్ అహర్నిశలు కృషి చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే నవరత్నాల పేరిట అందించే సంక్షేమ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లటంలో సక్సెస్ అయ్యారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ చాలా ప్రయత్నాలు చేశారు. అందుకే ఈ దఫా ఎన్నికల ఫలితాలు జగన్ పార్టీకి అనుకూలంగా ఉంటాయని ధీమాతో ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి .

జగన్ పీకే టీమ్ ను కలిసినప్పుడు కూడా సీఎం అని సంబోధించటం వారి కాన్ఫిడెన్స్ కు నిదర్శనం
ఇక జగన్ చేసిన కృషిలో , అంత వ్యూహాత్మంగా అడుగులు వెయ్యటంలో ప్రశాంత్ కిశోర్ పాత్ర ఎవరూ కాదనలేనిది .ఈ విషయం అందరికీ తెలిసిందే. మూడేళ్లుగా ప్రశాంత్ కిశోర్ టీం.. వైసీపీ కోసం పనిచేసింది. ఈ పని కచ్చితంగా ప్రతిఫలం ఇస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. విజయం కచ్చితంగా తమనే వరిస్తుందని జగన్ ధీమాతో ఉన్నారు. ఇక ఇటీవల జగన్ ప్రశాంత్ కిశోర్ టీంని కలిసినప్పుడు కూడా.. జగన్ ఆయన కాబోయే ముఖ్యమంత్రి అంటూ సంబోధించారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేసిన పీకే టీం విషయంలో బాగా సంతృప్తిగా ఉన్న జగన్ పీకే కు మరోమారు బంపర్ ఆఫర్ ఇచ్చారు .

పీకే కు బంపర్ ఆఫర్ ఇచ్చిన జగన్ ... అదేంటంటే
ఈ ఎన్నికల్లో కనుక వైసీపీ గెలిస్తే... ఇప్పటి వరకు ఎలాంటి సహాయ సహకారాలు అందించారో ఇక పై కూడా జగన్ తోపాటు పీకే టీం పనిచేసేలా ఒప్పందం చేసుకుందామని జగన్ కోరినట్లు తెలుస్తోంది. అంటే ఎప్పటికప్పుడు సర్వేలు చేయడం.. ఎలా చేస్తే ప్రజలను ఆకట్టుకోవచ్చు..ప్రజా వ్యతిరేకత ఎక్కడ ఉంది ? పాలనలో ఎలా ఉంటె ప్రజలకు మరింత చేరువ కావచ్చు వంటి అనేక అంశాలు , అలాంటి విషయాలను పీకే టీం జగన్ కి అందిస్తారు .

ఎన్నికల ఫలితాల తర్వాత పీకే సమాధానం .. జగన్ ఆఫర్ ఓకే చేస్తారా ?
మరి దీనికి ప్రశాంత్ కిశోర్ ఎలా స్పందించారో మాత్రం తెలీలేదు. ఫలితాల తర్వాత తన సమాధానం చెబుదామని ఆయన ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ఒకవేళ జగన్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తే పీకే టీమ్ మళ్ళీ జగన్ తో కలిసి పని చేసే అవకాశం ఉంటుందని టాక్. మరి చూడాలి ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్న పీకే మరియు ఆయన టీమ్ పెట్టుకున్న నమ్మకం ఏ మేరకు నిజం అవుతుందో. జగన్ ఇచ్చిన బంపర్ ఆఫర్ విషయంలో పీకే ఏం చెయ్యనున్నారో.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications