• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మిస్టర్ జగన్ రెడ్డి: లండన్‌లో సైకాలజీ ఆసుపత్రికి ఎందుకెళ్లారు?: నాకో కండోమ్స్ కావాలి: రఘురామ

|

అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు తన విమర్శల రూటు మార్చారు. ఇన్నాళ్లూ పార్టీలో ఎవరో ఒకరిని అడ్డుగా పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు గుప్పిస్తూ వచ్చిన ఆయన.. ఈ సారి ప్రత్యక్ష దాడికి దిగారు. నేరుగా వైఎస్ జగన్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు. శవాలతో వ్యాపారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రధాని పీఠంపై కన్నేశారని, అందుకే కరోనా వైరస్ మరణాలపై తప్పుడు లెక్కలు చూపిస్తున్నారంటూ ఆరోపించారు. ఆసుపత్రుల్లో అధ్వాన్న పరిస్థితులు నెలకొని ఉన్నాయని విమర్శించారు.

మద్యం దుకాణాలెందుకు?

మద్యం దుకాణాలెందుకు?

కరోనా వైరస్ కల్లోలాన్ని రేపుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ సర్కార్.. ప్రజలను మద్యానికి బానిస చేసేలా వ్యవహరిస్తోందని రఘురామ ఆరోపించారు. పొరుగునే ఉన్న ఒడిశా, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ను అమలు చేస్తోన్నప్పటికీ.. జగన్ రెడ్డి ఎందుకు కర్ఫ్యూ వరకే పరిమితమయ్యారని ప్రశ్నించారు. ఆయా రాష్ట్రాల కంటే ఏపీలోనే కరోనా మరణాలు అధికంగా ఉన్నాయని విమర్శించారు. వెయ్యి మంది మరణిస్తే.. దాన్ని వందగా చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. మద్యం దుకాణాలను తెరవడానికి అనుమతి ఇవ్వడం వల్ల ప్రజలు అక్కడే తిరుగుతున్నారని రఘురామ ఎద్దేవా చేశారు.

ప్రధానమంత్రి అవ్వాలని ఉంటే..

ప్రధానమంత్రి అవ్వాలని ఉంటే..

ప్రధానమంత్రి కావాలనే కోరిక జగన్‌కు ఉంటే ఉండొచ్చని, దాని కోసం ప్రజల ప్రాణాలను బలి పెట్టడం సరికాదని రఘురామ అన్నారు. ప్రాంతీయ పార్టీగా ఉన్న వైసీపీ భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పొచ్చని, వైఎస్ జగన్ ప్రధాని కావొచ్చని జోస్యం చెప్పారాయన. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కూడబట్టిన పైసలతో ప్రధాని కావాలనుకునే జగన్ రెడ్డి కోరికను పైనున్న దేవుళ్లే కాదు.. ఆయన నమ్మే ఏసు క్రీస్తు కూడా హర్షించబోరని అన్నారు.

హైకోర్టు ఎందుకు అడగట్లేదు..?

హైకోర్టు ఎందుకు అడగట్లేదు..?


రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాలు, పాజిటివ్ కేసులు పెరిగిపోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్ పెట్టాలని ఏపీ హైకోర్టు.. జగన్ సర్కార్‌ను ఎందుకు అడగట్లేదని రఘురామ ప్రశ్నించారు. న్యాయస్థానాల మీద తనకు గౌరవం ఉందని, అయినప్పటికీ- లాక్‌డౌన్ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవట్లేదో తనకు అర్థం కావట్లేదని, ఇది తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని వ్యాఖ్యానించారు. దీనిపై ఓ ఎంపీగా తాను రిప్రజెంటేషన్ పంపిస్తానని అన్నారు. హైకోర్టు అధికారాలను ఎవరూ ప్రశ్నించబోరని, తాను ఓ ఎంపీగా విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయంతో బతికేయాలని జగన్ సర్కార్ కుట్ర పన్నిందని ధ్వజమెత్తారు.

వాడో దుర్మార్గుడు..

వాడో దుర్మార్గుడు..

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపైనా రఘురామ విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్‌కు బాబాయ్ వరుస అయ్యే దుర్మార్గుడికి దేవస్థానం పగ్గాలను అప్పగిస్తే.. అతను దోచుకుని తింటున్నాడని మండిపడ్డారు. ఆవ భూముల్లో అందినంత దోచుకుని దాచుకున్నాడని అన్నారు. దీనిపై తాను ప్రధానికి లేఖ రాశానని చెప్పారు. దీనిపై విచారణ జరిపించాల్సిందిగా ప్రధానమంత్రి కార్యాలయం రాష్ట్రాన్ని ఆదేశిస్తే.. ఇప్పటిదాకా దాని ఊసే ఎత్తలేదని రఘురామ తెలిపారు. పవిత్రమైన తిరుమల బోర్డుపై అపవిత్రుడిని కూర్చోబెట్టారని ధ్వజమెత్తారు.

శ్రీరెడ్డిపైనా

శ్రీరెడ్డిపైనా


తనపై విమర్శలు చేసిన శ్రీరెడ్డిపైనా రఘురామ పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెడ్డి అని పేరు పెట్టుకుని బతికేస్తున్నారని విమర్శించారు. వైసీపీ సానుభూతిపరుల తీరునూ ఆయన తప్పుపట్టారు. తనకు డజను కండోమ్స్ కావాలంటూ ఫోన్ చేసి అడుగుతున్నారని, వాళ్లంతా ఎవరని రఘురామ ప్రశ్నించారు. వీళ్లంతా ఎవరికి పుట్టారు? ఎందుకు పుట్టారని నిలదీశారు. ప్రజల ప్రాణాలు పోతోంటే అధికార పార్టీ నేతలకు కండోమ్‌లు గుర్తుకొస్తున్నాయని విరుచుకుపడ్డారు.

English summary
Ruling YSR Congress Party Rebel MP Raghu Rama Krishnam Raju slams Chief Minister YS Jagan Mohan Reddy and told that he is eyeing on PM seat, hence showing false covid death numbers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X