Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పల్నాటి పులి కోడెల.. జగన్ వేధింపులతోనే బలి, రెండో వర్ధంతి నాడు లోకేష్ తో పాటు టీడీపీ నేతల ఆక్రోశం

ఈ రోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రెండవ వర్ధంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు .కోడెల చిత్రపటానికి టిడిపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోడెల శివప్రసాద్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఇదే సమయంలో జగన్ దాష్టీకానికి కోడెల శివప్రసాద్ బలైపోయారు అని జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు.

కోడెల పల్నాటి బిడ్డ .. ఆయన సేవలు చిరస్మరణీయం

కోడెల పల్నాటి బిడ్డ .. ఆయన సేవలు చిరస్మరణీయం

36 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీలో ఉండి ప్రజల కష్టనష్టాలలో అండగా నిలిచిన నేత కోడెల శివప్రసాద్ సేవలను కొనియాడారు. రాజకీయ కక్ష సాధింపులతో కోడెల శివప్రసాద్ ను బలి తీసుకున్నారని జగన్ పై అసహనం వ్యక్తం చేశారు.ఎవరు ఏమి చేసినా ప్రజల మనసుల్లో కోడెల చిరస్మరణీయంగా ఉంటారని ఆయన జ్ఞాపకాలను ఎవరూ చెరిపి వేయలేరని వ్యాఖ్యానించారు. విభజిత ఆంధ్రప్రదేశ్ కు తొలి స్పీకర్ గా ఆయన నిర్వహించిన పాత్ర ఆదర్శనీయమని కోడెలను కొనియాడారు. డాక్టర్ గా ఆయన చేసిన సేవలు మరిచిపోలేనివని, ఒక డాక్టర్ గా ఆయన పల్నాటి బిడ్డగా గుర్తింపు పొందారన్నారు టీడీపీ నేతలు.

ఆయన పల్నాటి పులి; ఆయనది ప్రభుత్వ హత్యే : చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు కోడెల శివప్రసాద్ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు. ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసిన చంద్రబాబు మూడున్నర దశాబ్దాల తన రాజకీయ జీవితంలో పల్నాటి ప్రజలకు, తెలుగుదేశం పార్టీకి అన్నివేళలా అండగా నిలిచిన ఒక ధైర్యం డా.కోడెల శివప్రసాదరావు అంటూ పేర్కొన్నారు. అందుకే ప్రజలు ఆయనను పల్నాటి పులి అని పిలిచారు. కోడెల శివప్రసాదరావు గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆ చిరస్మరణీయ ప్రజానేత స్మృతికి నివాళులు అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అంతేకాదు కోడెల శివ ప్రసాద్ ది ప్రభుత్వ హత్యేనని చంద్రబాబు ఆరోపించారు. అంతేకాదు రాష్ట్రంలో కోడెల తరహాలో జగన్ వేధింపులకు ఎంతో మంది బలైపోతున్నరన్నారు చంద్రబాబు.

జగన్ సీఎం అయ్యాక మూడు నెలల్లోనే కోడెలను చంపేశారు : నక్కా ఆనంద్ బాబు

జగన్ సీఎం అయ్యాక మూడు నెలల్లోనే కోడెలను చంపేశారు : నక్కా ఆనంద్ బాబు

ఏపీ సీఎం జగన్ దుశ్చర్యలకు కోడెల శివప్రసాద్ బలైపోయారు అని టిడిపి నేత మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ద్వజమెత్తారు. ప్రస్తుతం పల్నాడులో కోడెల ముందు.. కోడెల తర్వాత అన్నట్లుగా చర్చ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కోడెల రాష్ట్రంలో ఏ శాఖలో పనిచేసిన ఆ శాఖకు వన్నె తెచ్చారని, ఆయన రాష్ట్రానికి ఓ బ్రాండ్ అని పేర్కొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక మూడు నెలల్లోనే కోడెల శివప్రసాద్ ను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. పల్నాడులో ఫ్యాక్షన్, అహంకార రాజకీయాలను మార్చివేసిన కోడెల పల్నాడు రాజకీయాలలో కీలక మార్పులు తెచ్చారని అభివర్ణించారు.

కోడెలను జగన్ ప్రభుత్వం వేధించి బలి తీసుకుంది : ఆలపాటి రాజా

కోడెలను జగన్ ప్రభుత్వం వేధించి బలి తీసుకుంది : ఆలపాటి రాజా

సీఎం జగన్ కోడెలను చంపేశారని ఆ కసి తీర్చుకోవాలంటే మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలని, సత్తెనపల్లి నరసరావుపేట లో తెలుగుదేశం పార్టీని భవిష్యత్తు ఎన్నికలలో గెలిపించాలని నక్క ఆనంద్ బాబు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే కోడెలను జగన్ ప్రభుత్వం వేధించి బలి తీసుకుందని టిడిపి సీనియర్ నాయకులు ఆలపాటి రాజా విమర్శించారు. పల్నాడు ప్రాంత అభివృద్ధి చెందిందంటే అది కోడెల పుణ్యమే అంటూ తేల్చి చెప్పారు. కోడెల శివప్రసాద్ కృషివల్లే కోటప్పకొండకు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందని ఆలపాటి రాజా పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే కోడెల శివప్రసాద్ కు నిజమైన నివాళి అని పేర్కొన్న ఆలపాటి రాజా కోడెల శివప్రసాద్ బ్రతికి ఉన్న సమయంలో పల్నాడు రాజకీయాలను, ప్రస్తుత పల్నాడు పరిస్థితిని పోల్చి చూసుకోవాలన్నారు.

హోం మంత్రి కోడెలను చూసి నేర్చుకోవాలి : అయ్యన్న పాత్రుడు

హోం మంత్రి కోడెలను చూసి నేర్చుకోవాలి : అయ్యన్న పాత్రుడు

రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ హోం మంత్రి చూస్తే జాలేస్తుంది పేర్కొన్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు గతంలో కోడెల శివప్రసాద్ హోం మంత్రిగా పని చేశారని, ఆయన పనితీరు ఏవిధంగా ఉండేదో తెలుసుకొని, చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో కేవలం కోడెల శివప్రసాద్ ను చూడటం కోసమే విశాఖ నుండి నరసరావుపేట కు వెళ్ళినట్లుగా గుర్తు చేసుకున్నారు. కారులో కోడెల మీటింగ్ కు వెళ్లి, దూరం నుండి ఆయన మీటింగ్ విని వెళ్లేవాడిని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కోడెల శివప్రసాద్ యొక్క గొప్పతనాన్ని కోడెల రెండో వర్ధంతి నాడు చెప్పుకొచ్చారు.

కోడెలను అనుసరించే వాడిని : అయ్యన్న పాత్రుడు

కోడెలను అనుసరించే వాడిని : అయ్యన్న పాత్రుడు

కోడెలను తాను అనుసరించే వాడినని అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. కోడెల శివప్రసాద్ మరుగుదొడ్ల నిర్మాణ అంశంలో జాతీయ అవార్డు పొందారు అని గుర్తు చేసిన అయ్యన్నపాత్రుడు కోడెలను చూసి తను తన నియోజకవర్గంలో స్మశానాలను అభివృద్ధి చేసినట్లు అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. జైలులో చిప్పకూడు తినాల్సిన వారిని సీఎంను చేశారని, అందుకే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయని అయ్యన్నపాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Recommended Video

    ysr 12th Vardhanthi Report from Lotus pond | Oneindia Telugu

    ఉన్మాద పాలకుల కక్షలు, కుట్రల కారణంగా కోడెల దూరమయ్యారు : లోకేష్

    కోడెల వర్ధంతి సందర్భంగా జగన్ సర్కార్ పై ధ్వజమెత్తిన లోకేష్ ఉన్మాద పాలకుల కక్షలు, కుట్రల కారణంగా డా.కోడెల శివప్రసాదరావు మనకు దూరమై రెండేళ్లు. ఆయనను భౌతికంగా మన మధ్య లేకుండా చేయగలిగారు గానీ పల్నాటి ప్రజల గుండెల్లో ఆయన స్థానం ఎప్పుడూ పదిలంగా ఉంటుంది. కోడెల శివప్రసాదరావు గారి వర్ధంతి సందర్భంగా ఆ ప్రజానేత స్మృతికి నివాళులు అంటూ ఆయనను స్మరించుకున్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా టీడీపీ నాయకులు , ఆయన అభిమానులు ఆయనకు నివాళులు అర్పించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+