అపెక్స్ కౌన్సిల్ భేటీ- విజయవాడకు కృష్ణా బోర్డు తరలింపు- 4 అంశాలకు కేసీఆర్, జగన్ ఒకే...
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు జల వివాదాల పరిష్కారం కోసం ఇవాళ కేంద్ర జల్‌శక్తి మంత్విత్వశాఖ నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ భేటీ విజయవంతమైనట్లు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రకటించారు. రెండు గంటల పాటు సాగిన ఈ భేటీలో మొత్తం నాలుగు అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని ఆయన ప్రకటించారు. ఇందులో కృష్ణా రివర్ బోర్డు కార్యాలయం తరలింపుతో పాటు ఇతర అంశాలున్నాయి.

ఏపీ విభజన పూర్తయి ఆరేళ్లు గడుస్తున్నా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై క్లారిటీ రాకపోవడంపై కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇవాళ జరిగిన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు, ఇతర అధికారుల భేటీలో మాత్రం పలు అంశాలపై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు షెకావత్ తెలిపారు. ఇందులో ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న కృష్ణా రివర్ బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలని నిర్ణయించారు.

Recommended Video
కృష్ణా, గోదావరి నదులపై ఏ కొత్త ప్రాజెక్టు కట్టాలన్నా దానికి అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉండాల్సిందేనని కేంద్రమంత్రి షెకావత్ స్పష్టం చేశారు. ఈ విషయంలో కొత్త ప్రాజెక్టులకు డీపీఆర్‌లు సమర్పించేందుకు కూడా ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ అంగీకరించినట్లు ఆయన తెలిపారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని కేంద్రం త్వరలోనే నిర్ణయిస్తుందని షెకావత్ వెల్లడించారు. విభజన చట్టం ప్రకారమే నిర్ణయాలు ఉంటాయన్నారు. చాలా అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చామని, ఇందుకు సహకరించిన ఇద్దరు ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు.
-
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
ఎల్పీజీ స్ధానంలో PNG కనెక్షన్ తీసుకుంటే - ఏపీ సర్కార్ భారీ సబ్సిడీ ఆఫర్ ..! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications