అదిరిపోయే వ్యూహంతో అమరావతి ఉద్యమానికి చెక్- జగన్ ప్లాన్ మామూలుగా లేదుగా !...

అమరావతిలో బహుజన పరిరక్షణ సమితి పేరుతో ప్రారంభమైన కౌంటర్ ఉద్యమం కలకలం రేపుతోంది. అమరావతి నుంచి రాజధాని తరలింపుకు నిరసనగా 80 రోజులుగా ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు దానికి కౌంటర్ గా దళితులతో పోటీ ఉద్యమం ప్రారంభం కావడం వెనుక అధికార వైసీపీ ఉందన్న ప్రచారం జరుగుతోంది.

 అమరావతిలో 80 రోజుల ఉద్యమం

అమరావతిలో 80 రోజుల ఉద్యమం

ఏపీలో అధికార వికేంద్రీరణ పేరుతో మూడు రాజధానులకు సీఎం జగన్ తెరలేపిన నేపథ్యంలో గతేడాది డిసెంబర్ 18 న ప్రారంభమైన అమరావతి ఆందోళనలు ఇవాళ్టికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా రాజధాని గ్రామాలకు చెందిన వందలాది మంది నిత్యం ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పలుచోట్ల విన్నూత్న రూపాల్లో నిరసన తెలుపుతూనే ఉన్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. రాజధానిలో అమరావతి ఉద్యమం వెనుక టీడీపీ నేతల ప్రోద్భలం ఉందని భావిస్తున్న వైసీపీ సర్కారు ఉద్యమాన్ని లైట్ తీసుకుంటోంది.

రాజధాని తరలింపుకు సన్నాహాలు

రాజధాని తరలింపుకు సన్నాహాలు

అమరావతిలోని సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలను విశాఖకు తరలించడం ద్వారా కార్యనిర్వాహక రాజధానిని ఏర్పాటు చేసేందుకు వైసీపీ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. మే నెలలో అమరావతి నుంచి విశాఖ వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే సచివాలయ ఉద్యోగులకు సైతం ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ నుంచి పాలన ప్రారంభించేందుకు వీలుగా అనువైన భవనాల అన్వేషణ కూడా కొనసాగుతోంది. దీంతో అమరావతి ఇక చట్ట సభల రాజధానిగా మాత్రమే కొనసాగబోతోంది. అయితే అమరావతి ప్రాంతంలో పరిస్ధితిని మాత్రం తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇప్పటికే వైసీపీ పలు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తాడికొండ నియోజకవర్గానికి చెందిన పలువురు దళిత నేతలను తెరపైకి తీసుకొస్తున్నారు.

 అమరావతికి పోటీ ఉద్యమం

అమరావతికి పోటీ ఉద్యమం

రాజధాని ప్రాంతంలో కమ్మ సామాజిక వర్గం హవా కొనసాగుతుందన్న విషయాన్ని ఇప్పటికే ప్రచారంలోకి తీసుకొచ్చిన వైసీపీ... ఇప్పుడు వారికి కౌంటర్ గా అంతర్గతంగా మిగతా కులాలను ఎగదోసే పనిలో బిజీగా ఉంది. ముఖ్యంగా ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న రిజర్వుడు నియోజకవర్గం తాడికొండలో వారి మద్దతుతోనే మరో ఉద్యమాన్ని వైసీపీ ప్రారంభినట్లుగా తెలుస్తోంది. రెండురోజులుగా రాజధాని ప్రాంతంలో కనిపిస్తున్న బహుజన పరిరక్షణ సమితి ఆందోళనలు చూస్తుంటే అమరావతికి పోటీ ఉద్యమాన్ని ప్రభుత్వం మొదలుపెట్టిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Recommended Video

    AP 3 Capitals : BJP Dharna Against Ap Capitals Creates High Tension || Oneindia Telugu
     పోటీ ఉద్యమం డిమాండ్ల వెనుక వ్యూహం

    పోటీ ఉద్యమం డిమాండ్ల వెనుక వ్యూహం

    అమరావతి ఉద్యమానికి పోటీగా వైసీపీ మద్దతుతో ప్రారంభమైన ఆందోళనల వెనుక భారీ వ్యూహమే ఉంది. రాజధాని ప్రాంతంలో ఆధిపత్యం కోసం కమ్మసామాజిక వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తాజాగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పేదలకు ఇక్కడి భూములు కేటాయించిన జగన్ సర్కారు... ఇప్పుడు ఇక్కడి దళితులతో 50 వేల పక్కా ఇళ్లు కావాలని డిమాండ్ చేయించడం చూస్తుంటే ఇతర ప్రాంతాలకు చెందిన మరికొందరిని ఇక్కడికి తీసుకురావాలన్న వ్యూహం కనిపిస్తోంది. దళితులకు అమరావతిలో భూములు ఇస్తామని ప్రకటించి వారి మద్దతును సుస్ధిరం చేసుకోవాలని భావిస్తున్న వైసీపీ సర్కారు.. అలా అయితే కమ్మ సామాజిక వర్గం కౌంటర్ చేసే అవకాశం ఉండదని అంచనా వేస్తోంది. అయితే దీన్ని ఎలా కౌంటర్ చేయాలనే అంశంలో అప్పుడే టీడీపీలో మథనం ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+