ఏపీ గవర్నర్‌ను కలిసిన జగన్: చంద్రబాబు సర్కారుపై ఫిర్యాదు
ఏపీ మాజీ సీఎం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం సాయంత్రం విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. సుమారు 45 నిమిషాలపాటు గవర్నర్‌తో సమావేశమయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన మొదలైనప్పటి నుంచి. గత 45 రోజులుగా రాష్ట్రంలో హత్యలు, దాడులు జరుగుతున్నాయని గవర్నర్ కు జగన్ ఫిర్యాదు చేశారు.
పలు సంఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను గవర్నర్‌కు చూపించారు జగన్. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇటీవల పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన రషీద్ అనే యువకుడి హత్య ఘటన, పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్ల దాడి, ఇతర సంఘటలను జగన్ గవర్నర్‌కు వివరించారు. అంతేగాక, ఆయా ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా గవర్నర్‌కు అందించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న లా అండ్ ఆర్డర్‌ను పునరుద్ధరించేందుకు గవర్నర్ చర్యలు తీసుకోవాలని జగన్ కోరారు.
ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: విజయసాయి రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ఆరోపించారు. వైసీపీ వాళ్లపై దాడు చేయడమే కాకుండా తిరిగి తమపైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అఖిలపక్ష సమావేశంలో ఏపీలో శాంతి భద్రతలు, ప్రభుత్వ వైఫల్యాలు, ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు అంశాలను వైసీపీ లేవనెత్తినట్లు విజయసాయి తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్రానికి నిధుల వాటా పెంచాలని అఖిలపక్ష సమావేశంలో కోరామన్నారు.
కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్ ఏర్పాటు చేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దు. ఏపీలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి. గడిచిన ఐదేళ్లుగా మమ్మల్ని సౌత్ కోస్టల్ రైల్వే జోన్ గురించి భూమి ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి. సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలి. రాష్ట్రాల నిధుల వాటా విషయంలో జనాభా నియంత్రణ చేస్తున్న రాష్ట్రాలు నష్టపోతున్నాయని, జనాభా నియంత్రించని రాష్ట్రాలు లాభ పడుతున్నాయని విజయసాయి చెప్పారు.












Click it and Unblock the Notifications