అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు నోటీసుల్ని తప్పుబట్టిన బీజేపీ-నంద్యాల్లో ఓడాక జగన్‌ వ్యాఖల్ని గుర్తుచేస్తూ

|
Google Oneindia TeluguNews

అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ సీఐడీ జారీ చేసిన నోటీసులపై బీజేపీ స్పందించింది. పరోక్షంగా ఈ నోటీసుల్ని తప్పుబట్టింది. అయితే ఈ విషయంలో జగన్, చంద్రబాబు దొందూ దొందేనని వ్యాఖ్యానించింది. తద్వారా గతంలో చంద్రబాబు చేసిన పనుల్నే ఇప్పుడు జగన్‌ చేస్తున్నారని బీజేపీ నేత సునీల్‌ దేవధర్‌ ఆరోపించారు.

నాడు వైఎస్ జగన్ కేసులో లక్ష్మీనారాయణ..నేడు చంద్రబాబు కేసులో అదే లక్ష్మీనారాయణనాడు వైఎస్ జగన్ కేసులో లక్ష్మీనారాయణ..నేడు చంద్రబాబు కేసులో అదే లక్ష్మీనారాయణ

చంద్రబాబుకు సీఐడీ జారీ చేసిన నోటీసులపై ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దేవధర్‌ ఓ ట్వీట్‌లో స్పందించారు. సీఐడీ నోటీసులపై పరోక్షంగా స్పందిస్తూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. గతంలో నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం తర్వాత ఏం మాట్లాడారో గుర్తుకు తెచ్చుకోవాలని సీఎం జగన్‌కు దేవధర్‌ సూచించారు. ప్రభుత్వంలో ఎవరున్నా ఇదే జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో సునీల్‌ ట్వీట్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

jagan, naidu both are same- says bjp incharge sunil deodhar on notices to tdp chief

చంద్రబాబుకు జారీ చేసిన సీఐడీ నోటీసులపై ఇదే ట్వీట్‌లో మరో పేరాలో స్పందించిన సునీల్‌ దేవధర్‌.. ఏపీ ప్రజలు మీరిద్దరినీ గమనిస్తుతున్నారని సునీల్ దేవధర్‌ పేర్కొన్నారు. అధికారంలో ఎవరున్నా డబ్బు, అధికారాన్ని సొంత ప్రయోజనాల కోసం వాడుకోవడం పరిపాటిగా మారిందని దేవధర్ వ్యాఖ్యానించారు. తద్వారా గతంలో చంద్రబాబు కక్షసాధింపు రాజకీయాలు చేస్తే ఇప్పుడు జగన్‌ కూడా అదే చేస్తున్నారని దేవధర్‌ తెలిపారు. దీంతో జనం మీరిద్దరినీ సాగనంపి బీజేపీ-జనసేనను ఎన్నుకుంటారని జోస్యం చెప్పారు.

jagan, naidu both are same- says bjp incharge sunil deodhar on notices to tdp chief

English summary
ap bjp incharge sunil deodhar on tuesday compares cm jagan with chandrababu in wake of recent cid notices to tdp chief. says both are misuing money and govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X