వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్‌ జగన్ సొంత వ్యక్తులకే నచ్చలేదు..! ఇక జనాలకు ఏం నచ్చుతుందన్న నారా లోకేష్‌..!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : జనరంజక బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని అధికార పార్టీ చెబుతుంటే, ప్రభుత్వ వ్యాఖ్యలను ప్రతిపక్ష నేతలు తప్పుబడుతున్నారు. ఒకరేమో పసలేని బడ్జెట్ అంటుంటే.. మరొకరేమో బడ్జెట్‌ను ఎద్దేవాచేస్తున్నారు. ఇంకొకరేమో ఆక్షేపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రభుత్వ వైఫల్యాలను టీడీపీ అధినేత లోకేష్ ప్రశ్నింస్తున్నారు.

ఎప్పటికప్పుడు సీఎం జగన్‌ను మంత్రులను నిలదీస్తున్నారు. ప్రభుత్వ విధాలపై సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. బడ్జెట్‌పై ట్విట్టర్‌లో నారా లోకేష్‌ విసుర్లు విసిరారు. ప్రభుత్వం కోసిన కోతలకు, బడ్జెట్‌లో కేటాయించిన నిధులకు పొంతన లేదని ఎద్దేవాచేశారు. ఈ విషయం పక్కనే ఉన్న వైసీపీ సభ్యులకు ముందే తెలిసినట్టుందని, బడ్జెట్‌పై సొంత పార్టీ నేతలే అసంతృప్తిగా ఉన్నారని వెల్లడించారు. సీఎం జగన్‌ హామీలను గుర్తించుకుని, బడ్జెట్ విన్న ప్రజల పరిస్థితి ఏంటో అని లోకేష్‌ ప్రశ్నించారు.

Recommended Video

చంద్రబాబు పై వైసీపీ ఎమ్మెల్యేల మాటల దాడి
Jagan own people Dont like the Budget.!How the public believe Nara Lokesh questions..!

బడ్జెట్‌ కొత్త సీసాలో పాత సారాలా ఉందని టీడీపీ నేత కళా వెంకట్రావ్‌ ఎద్దేవాచేశారు. అంకెల గారడీ తప్ప కేటాయింపుల్లో చిత్తశుద్ధి లేదని తప్పుబట్టారు. విత్తనాలు కూడా అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, విద్యుత్‌కి రూ. 400 కోట్లు ఎలా సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. ఇది రైతులు, పేదలు, యువతకు వ్యతిరేకమైన బడ్జెట్‌ని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి రాగానే పవర్ కట్ మొదలైందని, బడ్జెట్‌లో రాష్ట్రాభివృద్ధిని పరిగణనలోకి తీసుకోలేదని కళా వెంకట్రావ్‌ దుయ్యబట్టారు.

వడ్డీ లేని రుణాలపై చర్చ సందర్భంగా గురువారం సీఎం చాలా ఆవేశంగా మాట్లాడారని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. కానీ, తాము ఇష్టానుసారంగా కాకుండా దస్త్రాల ఆధారంగా మాట్లాడుతున్నామన్నారు. సున్నా వడ్డీకి రుణాలపై చర్చ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దస్త్రాల్లో ఉన్న సమాచారాన్ని సభలో చదివి వినిపించారు. వడ్డీలేని రుణాలు చెల్లించామని ధ్రువీకరిస్తూ అధికారులు జారీ చేసిన లేఖలను సభలో చూపించారు.

English summary
While the ruling party claims to have introduced a popular budget, opposition leaders are refusing to comment on the government. One is a budget that is not worth it. Something else. TDP chief Lokesh has been questioning the government's failures since the formation of the YCP government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X