అమరావతి రైతులకు జగన్ మరో గుడ్ న్యూస్-నెలాఖరులోగా ప్లాట్ల రిజిస్ట్రేషన్-సీఆర్డీయే ప్రకటన
ఏపీ రాజధాని అమరావతికి మళ్లీ మంచి రోజులొచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించిన రైతులు.. తాము కోరుకున్న విధంగానే ఒకే రాజధానిని సాధించుకున్నారు. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు ప్రభుత్వం కూడా సిద్దమవుతుండటంతో రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది. తాజాగా సీఆర్డీయే చేసిన మరో ప్రకటన రైతుల్లో ఉత్సాహం నింపుతోంది.
Recommended Video


అమరావతిలో మరో అడుగు
ఏపీ రాజధాని అమరావతిలో గతంలో సీఆర్డీయే చట్టం ప్రకారం టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అడుగులు పడబోతున్నాయి. హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం, సీఆర్డీయే ఈ మేరకు ఒక్కొక్కటిగా చర్యలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అమరావతిలో ఫ్లాట్లపై దృష్టిపెట్టిన సీఆర్డీయే, లెక్కలు తీస్తోంది. అమరావతిలో గతంలో భూములిచ్చిన రైతుల్ని గుర్తించి వారికి భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సీఆర్డీయే అవకాశం కల్పిస్తోంది.

ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు సీఆర్డీయే లేఖలు
అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు గతంలో సీఆర్డీయే చట్టం ప్రకారం పలు హామీలు లభించాయి. వీటి ప్రకారం ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటూ సీఆర్డీయే రైతులకు లేఖలు రాస్తోంది. అమరావతిలో ఇలా ఫ్లాట్లు ఇవ్వాల్సిన రైతులు దాదాపు 23 వేల మంది ఉన్నారని గుర్తించిన సీఆర్డీయే.. వారందరికీ ఇప్పుడు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని లేఖలు రాస్తోంది. దీంతో రిజిస్ట్రేషన్లు ఎలా చేసుకోవాలో కూడా ఈ లేఖల్లో వివరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రైతులు కూడా రిజిస్ట్రేషన్లకు సిద్ధమవుతున్నారు.

ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ విధానం ఇలా
ఇప్పటివరకూ ఫ్లాట్లు రిజిస్టర్ చేసుకోని వారంతా ఈ నెల 31లోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సీఆర్డీయే కోరుతోంది. ఇందులో భాగంగా ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ విధానం కూడా వివరిస్తోంది. రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే రైతులు మూడు రోజుల ముందుగా సీఆర్డీయే వెబ్ సైట్లు స్లాట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ ప్రకారం రైతులు తమ భూముల అసలు దస్త్రాలతో పాటు ఆధార్ కార్డు తీసుకుని సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ పత్రాలు అధికారులకు ఇచ్చి ఫ్లాట్లు రిజిస్టర్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ కోసం ప్రతీ రైతు ఇద్దరు సాక్ష్యుల్ని కూడా తీసుకెళ్లాలి. ఇందులో ఎలాంటి సందేహాలున్నా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ 08645-244744, 08645-244778 నంబర్లపై సీఆర్డీయే కార్యాలయాన్ని సంప్రదించాలని కోరుతున్నారు.
-
బడి పిల్లలు శోభనం పెళ్లి కొడుకులా? ఏంటిది - గరికపాటి వ్యాఖ్యల వివాదం..!! -
ఏపీలో ఆ ప్రాంతానికి పులి, స్థానికుల భయం.. రంగంలోకి హనుమాన్ బృందాలు! -
రేషన్ లబ్దిదారుల కోసం ప్రభుత్వం ఊహించని నిర్ణయం, ఇక నేరుగా..!! -
రైతులకు శుభవార్త,. వారికి వందశాతం సబ్సిడీతో సోలార్ పంప్ సెట్స్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications