అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతిలో బయటి వారికీ ఇళ్ల స్ధలాలు-గవర్నర్ గెజిట్ విడుదల-హైకోర్టుకు రైతులు ?

|
Google Oneindia TeluguNews

అమరావతి రాజధానిలో మరో కొత్త గేమ్ కు తెరలేచింది. గతంలో అమరావతి రాజధాని కోసం టీడీపీ ప్రభుత్వం సేకరించిన స్ధలాల్లో పేదలకు ఇళ్ల స్ధలాలు ఇవ్వాలని నిర్ణయంతీసుకున్న వైసీపీ సర్కార్ హైకోర్టు అభ్యంతరాల నేపథ్యంలో చట్టసవరణ చేసి అసెంబ్లీ ఆమోదం తీసుకుంది. ఇప్పుడు గవర్నర్ ఆమోదం కూడా తీసుకుని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో అమరావతి రాజధానిలో ఇతర జిల్లాల వారికీ ఇళ్ల స్ధలాలు ఇచ్చేందుకు వీలు కలిగింది. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేయబోతున్నారు.

అమరావతిలో ఇతరులకు స్ధలాలు

అమరావతిలో ఇతరులకు స్ధలాలు

అమరావతి రాజధాని కోసం సేకరించిన భూముల్లో ఇతర జిల్లాల వారికి ఇళ్ల స్ధలాలు కేటాయిస్తూ వైసీపీ సర్కార్ గతంలో నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇస్తున్న ఇళ్ల స్ధలాల పథకంలో భాగంగా అమరావతిలోనూ ఇతర జిల్లాల వారికి స్ధలాలు ఇచ్చింది. దీనిపై రాజధాని రైతుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. హైకోర్టు కూడా అభ్యంతరం వ్యక్తంచేసింది. దీంతో వెనక్కితగ్గినట్లే తగ్గిన ప్రభుత్వం అసెంబ్లీలో సీఆర్డీయే చట్ట సవరణ చేసింది. అమరావతి మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేయడం ద్వారా రాజధాని భూముల్ని ఇతర జిల్లాల పేదలకు పంచే కార్యక్రమానికి తెరలేపింది.

చట్టసవరణకు గవర్నర్ ఆమోదం

చట్టసవరణకు గవర్నర్ ఆమోదం

అమరావతి రాజధాని ప్రాంతంలో గతంలో సేకరించిన భూముల్ని సైతం ఇతర ప్రాంతాల పేదలకు పంచేలా సీఆర్డీయే చట్టంలో మార్పులు చేస్తూ గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. దీని ప్రకారం ఇక్కడి పేదలకే కాకుండా ఇతర ప్రాంతాల పేదలకు కూడా ఇక్కడ భూములు కేటాయించేందుకు అవకాశం దక్కింది. ఈ మేరకు సీఆర్డీయే చట్టంలో చేసిన చట్టసవరణకు అసెంబ్లీ, మండలి ఆమోదం తెలిపాయి. ఇప్పుడు గవర్నర్ కూడా తాజాగా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఈ నెల 18న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది ఇవాళ బయటికి వచ్చింది.

 గెజిట్ నోటిఫికేషన్ విడుదల

గెజిట్ నోటిఫికేషన్ విడుదల

తాజాగా విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదలకు రాజధాని అమరావతి లో ఇళ్లు, ఇళ్ళ స్థలాలు కేటాయించేందుకు ఉద్దేశించిన చట్ట సవరణలకు గవర్నర్ ఆమోదం తెలిపారు. సీఆర్దిఏ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డెవల్మెంట్ అథారిటీ చట్టం సవరణలకు ఆమోదం తెలియజేస్తూ గవర్నర్ బిశ్వ భూషణ్ నోటిఫికేషన్ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ఇళ్ళ పథకాలు రాజధాని ప్రాంతంలోనీ వారికి మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్రంలోని ఇతర అర్హుందరికీ ఇచ్చేలా చట్ట సవరణ చేశారు. దీనికి సంబంధించిన పాలకవర్గం తో పాటు ప్రత్యేక అధికారి కూడా నిర్ణయం తీసుకునేలా సీఆర్డీఏ చట్ట సవరణ చేశారు.
దీంతోపాటు మాస్టర్ ప్లాన్ లో మార్పు చేర్పులు చేసేందుకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ లో క్లారిటీ ఇచ్చారు.

హైకోర్టులో సవాల్ చేయనున్న రైతులు

హైకోర్టులో సవాల్ చేయనున్న రైతులు

సీఆర్డీయే చట్టంలో మార్పు చేర్పులకు వీల్లేదంటూ గతంలో ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, ఈ మేరకు సీఆర్డీయే చట్టం స్పష్టంగా నిర్దేశిస్తోందని హైకోర్టు గతంలో చెప్పింది. అలాగే అమరావతి కోసం ఆమోదించిన మాస్టర్ ప్లాన్ లోనూ మార్పులు చేయకూడదని తీర్పులో వెల్లడించింది. అయితే ఇందుకు విరుద్ధంగా ప్రభుత్వం చట్ట సవరణ చేసి గవర్నర్ ఆమోదముద్ర వేయించుకుంది. దీనిపై రైతులు మరో న్యాయపోరాటనికి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు త్వరలో గవర్నర్ ఆమోదించిన గెటిట్ నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. గతంలో ఇదే తరహాలో రాజధానుల చట్టాల్ని సవాల్ చేసి హైకోర్టులో విజయం సాధించిన రైతులు మరోసారి అదే తరహాలో దీన్నీ సవాల్ చేయాలని నిర్ణయించారు.

English summary
ap government has issued governor gazette notification on recently assembly approved apcrda act with amendments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X