పెన్షన్ రూల్స్ మార్చిన జగన్ సర్కార్-ఇక 50 ఏళ్లకే వారికి పెన్షన్-త్వరలో అమలు
ఏపీలో వైఎస్సార్ భరోసా కింద ఇస్తున్న సామాజిక పెన్షన్ల నిబంధనల్ని వైసీపీ సర్కార్ మరోసారి సవరించింది. దీని ప్రకారం ఇకపై కొన్ని వర్గాల వారికి ఇకపై గతంలోలా 35 ఏళ్లకు పింఛన్ ఇచ్చే కార్యక్రమానికి మంగళం పలికింది. దీని స్ధానంలో ఇకపై 50 ఏళ్లు దాటాకే పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో లక్షల మంది పెన్షన్ దారులపై ఈ ప్రభావం పడబోతోంది. త్వరలో ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

పెన్షన్ నిబంధనల్లో మార్పు
ఏపీలో వివిధ వర్గాలకు ప్రభుత్వం ఇస్తున్ను సామాజిక పెన్షన్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గతంలో పెన్షన్ ఇచ్చేందుకు ఉన్న వయోపరిమితుల్ని మారుస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీని వల్ల లక్షలాది మంది మహిళలపై ఈ ప్రభావం పడబోతోంది. ఈ మేరకు పెన్షన్ అర్హతల్ని సవరిస్తూ కొత్త విధానాన్ని ప్రభుత్వం అమలు చేయబోతోంది. ఆరునెలలకోసారి ఇస్తున్న పెన్షన్లలో ఈ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. దీంతో ఆరునెలల తర్వాత ఈ కేటగిరీల్లో పెన్షన్ లబ్దిదారుల సంఖ్యలో భారీగా కోతలు ఖాయంగా కనిపిస్తున్నాయి.

50 ఏళ్లకే ఒంటరి మహిళల పెన్షన్
రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ సర్కార్ 35 ఏళ్లకే భర్తల్ని వదిలేసిన ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తోంది. అయితే ఈ నిబంధనను మార్చి ఇకపై 50 ఏళ్లు దాటిన వారికే పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతే కాదు భర్తను వదిలేసిన ఏడాది తర్వాత మాత్రమే పెన్షన్ కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. అలాగే సదరు మహిళ ఒంటరిగా ఉంటున్నట్లు ధృవీకరణ పత్రాన్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

అవివాహితలకూ 50 ఏళ్లకే
ఇప్పటివరకూ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో అవివాహితలకు 35 ఏళ్ల నుంచి పెన్షన్ అమలు చేస్తున్నారు. నెలకు రెండున్నర వేల చొప్పున ఆరునెలలకు కలిపి ఒకేసారి వీరికి పెన్షన్ అందిస్తున్నారు. ఇకపై వీరికి కూడా 50 ఏళ్ల తర్వాతే పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో ప్రకటించింది. అలాగే అవివాహిత మహిళలకు కుటుంబం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని ధృవపత్రం సమర్పించాల్సి ఉంటుంది. దీంతో పాటు పెళ్లి కాలేదనే ధృవపత్రాన్ని కూడా ఎమ్మార్వో నుంచి తీసుకుని ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలు మాత్రం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తింపచేయనున్నారు.

సర్కార్ పై తగ్గనున్న భారం
వివిధ కేటగిరీల కింద ఉన్న వారికి పెన్షన్ సదుపాయాన్ని క్రమంగా తొలగిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆ మేరకు ఆర్దిక భారం తగ్గబోతోంది. ముఖ్యంగా వచ్చే ఆరునెలల్లో ఈ భారాన్ని క్రమంగా తగ్గించుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం తాజా నిబంధనల్ని అమల్లోకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అప్పులతో రాష్ట్రాన్ని నడపాల్సిన పరిస్ధితుల్లో ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వానికి ఈ భారం తగ్గితే కాస్తయినా ఊరట లభిస్తుందని భావిస్తున్నారు. ఈ మొత్తాలతో మిగతా పథకాలను మరింత మెరుగ్గా అమలు చేసేందుకు వీలు కుదురుతుంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications