Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

AP Registrations : కొత్త రిజిస్ట్రేషన్ విధానంపై ఏపీ సర్కార్ క్లారిటీ ఇదే.. !

ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న కొత్త రిజిస్ట్రేషన్ విధానంలో పారదర్శకతకు, భద్రతకు పెద్ద పీట వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని రాష్ట్ర రెవిన్యూ శాఖ స్పెషల్ సీఎస్, సీసీఎల్ఏ కూడా అయిన జి.సాయి ప్రసాద్ స్పష్టం చేశారు. కొత్త రిజిస్ట్రేషన్ విధానంపై ప్రజలు ఎలాంటి అపోహకూ గురికావద్దన్నారు. 1999లో రిజిస్ట్రేషన్ శాఖను కంపూటరీకరించడం జరిగిందని, అప్పుడు రూపొందించిన సాప్టువేర్నే ఇప్పటికీ అమలు చేస్తున్నామన్నారు.

పాత రోజుల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఆ సాప్టువేర్ సరిపోయేదని, అయితే ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల సంఖ్య ఏడాదికి 25 లక్షల వరకూ పెరిగిన నేపథ్యంలో ఆ సాప్టువేర్ ను అప్ డేట్ చేయాల్సిన అవసరాన్ని గుర్తించి కొత్త సాప్టువేర్ తో ఈ నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సాయిప్రసాద్ వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉత్తమ విధానాలను పరిగణలోకి తీసుకుని ఈ సాప్టువేర్ ను రూపొందించామన్నారు.

jagan regime clarifies on new registration policy, says transparency and security is priority

తాజా సాప్టువేర్ అప్లికేషన్ లో క్రయ, విక్రయ దారుని పేరుతో పాటు ఆస్తి వివరాలను నమోదు చేయగానే ఒక మోడల్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుందన్నారు. అయితే అదనంగా ఏమన్నా క్లాజులను జోడించాలనుకుంటే 20 క్లాజుల వరకూ ఈ అప్లికేషన్ లో జోడించే అవకాశం ఉందన్నారు. ఆ క్లాజులు అన్నింటినీ కలుపుకుని సమగ్రంగా ఒక డాక్యుమెంట్ జనరేట్ అవుతుందన్నారు. రెవిన్యూ, రిజిస్ట్రేషన్ వెబ్ సైట్లోని సంబంధిత లింకు డాక్యుమెంట్లు కూడా ఈ అప్లికేషన్ లో కనిపిస్తాయన్నారు. తద్వారా క్రయ, విక్రయాలకు సంబందించిన డాక్యుమెంట్ల వెరిఫికేషన్ కూడా ఆటోమేటిక్ గా జరుగుతుందన్నారు.

ఎవరి ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్ శాఖ డాటాలోని విలువల ఆధారంగా స్టాంపు డ్యూటీ క్యాలిక్యులేషన్ కూడా ఆటోమేటిక్ గా జరిగుతుందన్నారు. ఈ స్టాంపు డ్యూటీని ఒకే చలానా ద్వారా చెల్లించేందుకు అవకాశం ఏర్పడిందని సాయిప్రసాద్ తెలిపారు. ఈ విధానంలో సబ్ డివిజన్, మ్యుటేషన్ ప్రక్రియ కూడా ఆటోమేటిక్ గా జరుగుతుందన్నారు. తద్వారా లేని భూమిని ఉన్నట్లుగా చూపించి రిజిస్ట్రేషన్ చేసేందుకు ఏమాత్రం అవకాశం ఉండబోదన్నారు. రిజిస్ట్రేషన్ లకు అవసరమైన స్లాట్ బుకింగ్ కూడా ఈ అప్టికేషన్ ద్వారా ఎంతో సులువుగా అవుతుందన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఐ.టి. చట్టం-2000 ప్రకారం ఏడాది క్రితం నుండి ఆస్తుల క్రయ, విక్రయాల డాక్యుమెంట్లకు ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ అమలు పర్చే అవకాశం కలిగిన నేపథ్యంలో అమ్మే వారి సంతకాన్ని బయోమెట్రిక్ అథంటికేషన్ ద్వారా ఎలక్ట్రానిక్ సంతకాన్ని తీసుకోవడం జరుగుతోందన్నారు. అలాగే రిజిస్ట్రారు సంతకాన్ని కూడా ఎలక్ట్రానిక్ సంతకంతోనే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నారు. క్రయ, విక్రయదారుల విజ్ఞప్తి మేరకు ఇ-స్టాంపు పేపర్ మీదే ఎలక్ట్రానిక్ సంతకాలతో ఫిజికల్ కాపీలను కూడా అందచేస్తున్నామన్నారు. ఈ డాక్యుమెంట్లను కోర్టులు, బ్యాంకులు కూడా పరిగణలోకి తీసుకుంటాయన్నారు.

క్రయ, విక్రయదారులు కావాలనుకుంటే ఈ నూతన రిజిస్ట్రేషన్ విధానంలో డాక్యుమెంట్ రైటర్ల సేవలను కూడా వినియోగించుకోవచ్చన్నారు. క్రయ, విక్రయదారులు ఈ అప్లికేషన్ ద్వారా డాక్యుమెంట్ రైటర్ల తోనే డాక్యుమెంట్లను రూపొందించుకుని, వారు సంతృప్తి పొందిన తదుపరి మాత్రమే సబ్ రిజిస్ట్రారు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చన్నారు. ఏ రిజిస్ట్రారు కార్యాలయం నుండి అయినా రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యం ఈ నూతన విధానంలో అందుబాటులోకి రానున్నట్లు ఆయన తెలిపారు .

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+