Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ స్కూల్ టైమింగ్స్ పెంపుపై తీవ్ర వ్యతిరేకత-సర్వత్రా విమర్శలు-తగ్గింపుపై మల్లగుల్లాలు

ఏపీలో పాఠశాలల రూపు రేఖలు మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ సర్కార్.. ఇప్పుడు వాటి పనివేళల్ని కూడా పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన పని వేళల్లో సాంస్కృతిక, సహ ప్రణాళిక అంశాల్ని బోధించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ స్కూళ్లు పనిచేయాలన్న సర్కార్ నిర్ణయంపై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్ధులు, తల్లితండ్రులతో పాటు ఉపాధ్యాయుల నుంచీ వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

 ఏపీలో విద్యా సంస్కరణలు

ఏపీలో విద్యా సంస్కరణలు

ఏపీలో వైసీపీ సర్కార్ విద్యాహక్కు చట్టంతో పాటు తాజాగా అమల్లోకి వచ్చిన జాతీయ విద్యావిధానం ప్రకారం రాష్ట్రంలోని స్కూళ్లలో సంస్కరణలు చేపడుతోంది. ఇందులో భాగంగా స్కూళ్ల రూపురేఖలు మార్చడంతో పాటు స్కూళ్లకు విద్యార్ధుల్ని పంపే తల్లులకు ఏడాదికి రూ.15 వేల రూపాయలు చొప్పున అమ్మఒడి పథకాన్ని కూడా అమలు చేస్తోంది. నాడు-నేడుతో రూపురేఖలు మార్చుకున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడు పని వేళల్ని కూడా పెంచడం ద్వారా విద్యార్ధులకు చదువులతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలపైనా ఆసక్తి పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో స్కూళ్లతో పాటు విద్యార్ధుల ఆలోచనా విధానం కూడా మారాలనేది ప్రభుత్వ ఉద్దేశం.

 స్కూళ్ల పనివేళల పెంపు

స్కూళ్ల పనివేళల పెంపు

విద్యాసంస్కరణల్లో భాగంగా స్కూళ్లను ఆరు రకాలుగా వర్గీకరించిన ప్రభుత్వం వాటిలో పని వేళల్ని సైతం పెంచింది. స్కూళ్ల టైమింగ్స్ ను ఉదయం 8 గంటల నుంచి గతంలో ఉన్న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకూ పెంచింది. పెంచిన సమయాల్లో ఆదనపు రెండు గంటల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర సహ పాఠ్యప్రణాళిక అంశాల్ని బోధించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో అధికారులు కొత్త టైమిుంగ్స్ కు టీచర్లను , విద్యార్ధుల్ని సన్నద్ధం చేస్తున్నారు. దీంతో ఉదయం పాఠశాలలకు వెళ్లిన విద్యార్ధులు.. తిరిగి ఇళ్లకు చేరుకునే సమయానికి చీకటి పడుతుంది.

 టైమింగ్స్ పెంపుపై విమర్శల వెల్లువ

టైమింగ్స్ పెంపుపై విమర్శల వెల్లువ

పాఠశాలల టైమింగ్స్ ను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్ధులు, వారి తల్లితండ్రులతో పాటు టీచర్లు సైతం ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏ విధంగానూ సమంజసంగా లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే కరోనా సమయంలో పాఠశాలలకు పిల్లల్ని పంపడమే కష్టంగా మారిన పరిస్ధితుల్లో ఇలా గంటల కొద్దీ గడపాల్సి రావడం విద్యార్ధులకు పెను భారంగా మారుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తరగతి గదుల్లో గంటల కొద్దీ ఉండిపోవడం వల్ల విద్యార్ధులు అలసిపోయే అవకాశం కూడా ఉందని తల్లితండ్రులు చెప్తున్నారు.

 ఉపాధ్యాయ సంఘాల ఫైర్

ఉపాధ్యాయ సంఘాల ఫైర్

ఏపీ పాఠశాలల్లో పెంచిన పనివేళలపై ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఇంగ్లీష్ మీడియాతో పాటు పలు కొత్త కొత్త అంశాల్ని తీసుకొచ్చి ఉపాధ్యాయులపై భారం పెంచుతున్నారని, ఇప్పుడు పని గంటలు కూడా పెంచితే ఎలా అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్ధులపై పెను భారం మోపేలా ఉన్న ఈ కొత్త టైమింగ్స్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సహ పాఠ్య కార్యక్రమాల్ని ఆప్షనల్ అని చెబుతూనే దాన్ని టైమ్ టేబుల్లో చేర్చడం వల్ల అప్పర్ ప్రైమరీ, హైస్కూల్ విద్యార్ధులు 10 గంటల పాటు స్కూల్లోనే ఉండిపోవాల్సి వస్తుందని, వారితో సమానంగా టీచర్లు కూడా ఉండాల్సి వస్తుందని ఉపాధ్యాయసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

 ప్రధాన అభ్యంతరాలివే

ప్రధాన అభ్యంతరాలివే

ఏపీ స్కూళ్లలో పెంచిన పాఠశాల టైమింగ్స్ అమలు చేయడంలో అందరికీ ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్ధులు ఉదయం 8 గంటలకు స్కూల్లో ఉండాలంటే ఉదయం 6 గంటలకే నిద్రలేచి, అల్పాహారం తీసుకుని స్కూలుకు రావాల్సి ఉంటుంది. అలా ఉదయం 8 గంటలకు వచ్చిన విద్యార్ధి మధ్యాహ్నం 1 గంట వరకూ ఏమీ తినకుండా ఉండాల్సి ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ పూర్తయినా తిరిగి సాయంత్రం 6 గంటలకు స్కూలు పూర్తయ్యాయ తిరిగి ఇంటికి చేరే నాటికి 7 లేక 8 గంటలవుతుంది. అప్పటివరకూ విద్యార్ధి తిరిగి ఏమీ తినకుండా ఉండిపోవాల్సి వస్తుంది. దీంతో విద్యార్ధులు తీవ్రంగా అలసిపోయే ప్రమాదం ఉందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బాలికలు సాయంత్రం 6 గంటలకు స్కూలు వదిలితే చీకట్లో ఇళ్లకు చేరాల్సి ఉంటుంది. అప్పుడు వారి భద్రతకు ఎవరు జవాబుదారీగా ఉంటారని ప్రశ్నిస్తున్నారు.

అసలే రాష్ట్రంలో రోజురోజుకూ మహిళలు, చిన్నారుల భద్రత ప్రశ్నార్ధకంగా మారుతున్న పరిస్దితుల్లో స్కూల్ టైమింగ్స్ పేరుతో
బాలికల భద్రతను ప్రమాదంలో నెట్టడం సరికాదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Recommended Video

    Araku Valley మండల కేంద్రంలో వాహనదారుల అవస్థలు | Visakhapatnam
     టైమింగ్స్ తగ్గింపుపై సర్కార్ మల్లగుల్లాలు

    టైమింగ్స్ తగ్గింపుపై సర్కార్ మల్లగుల్లాలు

    ఏపీ పాఠశాలల్లో అమలు చేస్తున్న విద్యాసంస్కరణల్లో భాగంగా పెంచిన స్కూల్ టైమింగ్స్ ను తగ్గించాలన్న డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో సర్కార్ పునరాలోచనలో పడింది. ఉపాధ్యాయ సంఘాలతో పాటు విద్యార్ధులు, తల్లితండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో స్కూల్ టైమింగ్స్ తగ్గించేందుకు ప్రయత్నిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హామీ ఇచ్చినట్లు ఉద్యోగసంఘాల నేత వెంకట్రామిరెడ్డి ప్రకటించారు. అయితే తాము తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవడంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా దీనికి ప్రత్యామ్నాయాలు ఏవైనా ఉన్నాయోమో పరిశీలించాలని అధికారుల్ని ప్రభుత్వం కోరే అవకాశముంది. ఆ తర్వాత కూడా ప్రత్యామ్నాయాలేవీ లేకపోతే టైమింగ్స్ తగ్గించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+