వాట్సాప్ తో జగన్ సర్కార్ ఒప్పందం-ఫేక్ న్యూస్ కు బ్రేక్-పథకాల ప్రచారమే టార్గెట్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం మీడియా వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రభుత్వం భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా అవి ప్రజల చెంతకు చేరడం లేదు. దానికి బదులు ఫేక్ న్యూస్ ఎక్కువగా ప్రచారం అవుతోంది. దీంతో ఫేక్ న్యూస్ కు అడ్డుకట్ట వేయడంతో పాటు సంక్షేమ పథకాల్ని ప్రజల వద్దకు మరింత దగ్గర చేసేందుకు వీలుగా ప్రభుత్వం సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ తో ఒప్పందం చేసుకుంది.

వాట్సాప్ తో ఏపీ సర్కార్ ఒప్పందం
ఏపీలో వైసీపీ ప్రభుత్వం సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. డిజిటల్ మీడియా కార్పోరేషన్ సాయంతో వాట్సాప్ సేవల్ని విరివిగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుంది. పలు కీలక అంశాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు వీలుగా ప్రభుత్వం ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రస్తుతం ఎదుర్కొంటున్న మీడియా సమస్యల్ని ఈ ఒప్పందం ద్వారా కాస్తయినా అధిగమించవచ్చనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది.

ఫేక్ న్యూస్ కు అడ్డుకట్ట
రాష్ట్రంలో ప్రస్తుతం ఫేక్ న్యూస్ విరివిగా సర్క్యులేట్ అవుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ప్రభుత్వ వ్యతిరేక సమాచారమే కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వం దీనిపై సీరియస్ గా దృష్టిపెట్టింది. ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు సోషల్ మీడియా ద్వారా నిత్యం టార్గెట్ చేస్తుండటంతో ఇది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. దీంతో వాట్సాప్ తో ఒప్పందం చేసుకోవడం ద్వారా ప్రతీ సమాచారాన్ని ఆధీకృతంగా పోస్ట్ చేసేందుకు ప్రభుత్వానికి వీలు కలగబోతోంది. తద్వారా ఫేక్ న్యూస్ కు ఆటోమేటిగ్గా అడ్డుకట్ట పడుతుంది.

సంక్షేమ ప్రచారానికీ..
ఏపీ ప్రభుత్వం తరఫున ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలను ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా ప్రభుత్వంతో కలిసి వాట్సాప్ పనిచేయనుంది. ఇప్పటివరకూ సంక్షేమ పథకాల ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా ఎంతగా చేస్తున్నా అది ప్రజలకు పూర్తి స్ఝాయిలో చేరడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడు వాట్సాప్ సేవలు అందుబాటులోకి వస్తే ప్రభుత్వం అధికారికంగా ప్రతీ పథకం గురించిన సమాచారాన్నీ ఎప్పటికప్పుడు పోస్ట్ చేసేందుకు వీలు కలుగుతుంది. అలాగే ప్రభుత్వ పథకాలపై దుష్ప్రచారాన్ని కూడా అడ్డుకునేందుకు వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
-
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
పుకార్ల దేశం.. అందుకే పెట్రోల్ బంకుల వద్ద ఆ క్యూలు! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఏపీ విద్యార్ధులకు సర్కార్ గుడ్ న్యూస్..! దేశంలో తొలిసారి..! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..!












Click it and Unblock the Notifications