వివేకా హత్య కేసు సాక్ష్యులకు గన్ మెన్ లు-కడప కోర్టు ఆదేశాలతో-ఎవరెవరికంటే ?
ఏపీలో పెను సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు నిందితుల్ని అరెస్టు చేసి జైలుకు పంపిన సీబీఐ.. ఇప్పుడు అసలు నిందితుల పాత్రపై దర్యాప్తు సాగిస్తోంది. ఇందులో సీబీఐకి సాక్ష్యమిచ్చిన పలువురు సాక్ష్యులు,వీరి భద్రత కూడా కీలకంగా మారింది. దీంతో సీబీఐ వీరికి భద్రత కల్పించాలని కోర్టును కోరింది.
వివేకా కేసులో ప్రధాన సాక్ష్యులుగా ఉన్న ఆయన మాజీ డ్రైవర్ దస్తగిరి, వాచ్ మెన్ రంగన్నలకు భద్రత కల్పించాలని గతంలో సీబీఐ కోరగా.. కడప కోర్టు అందుకు అంగీకరించి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం వారిద్దరికీ గన్ మెన్లను కేటాయిస్తూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో దస్తగిరి, రంగన్నల వద్దకు గన్ మెన్లను పంపారు. వీరిద్దరికీ వన్ ప్లస్ వన్ గన్ మెన్లను కేటాయించారు.

మరోవైపు వివేకా కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దంటూ వివేకా కుమార్తె సునీతారెడ్డి హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంలో తన వాదనలు వినాలని హైకోర్టును ఆమె కోరారు. దీంతో ఈ పిటిషన్ పై హైకోర్టు తదుపరి వాదనలను ఏప్రిల్ 6కు వాయిదా వేసింది. మరోవైపు ప్రస్తుతం జైల్లో ఉన్న ఇతర నిందితులు కూడా బెయిల్ పిటిషన్ల కోసం కడప కోర్టును, హైకోర్టును కూడా ఆశ్రయిస్తున్నారు. దీంతో ఈ బెయిల్స్ వ్యవహారం కూడా చర్చనీయాంశమవుతోంది.












Click it and Unblock the Notifications