Margadarsi : మార్గదర్శి చిట్ ఫండ్స్ పై వైఎస్ జగన్ మరో పిడుగు..!
ఏపీలో మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాలపై ఇప్పటికే సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో జగన్ సర్కార్ తన అభిప్రాయాన్ని అఫిడవిట్ రూపంలో వెల్లడించింది.
అమరావతి : ఏపీలో మార్గదర్శి చిట్స్ (Margadarsi Chits) అక్రమాలపై జగన్ సర్కార్ (ys jagan) కొరడా ఝళిపిస్తోంది. ఇప్పటికే మార్గదర్శి అక్రమాల కేసులో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ప్రభుత్వం.. రాష్ట్రంలోనూ చిట్ ఫండ్స్ కార్యాలయాలపై దాడులకు దిగుతోంది. ఇందులో భాగంగా పలు మార్గదర్శి ఆఫీసుల మేనేజర్లను అరెస్టు చేసి కోర్టులోనూ హాజరుపరిచి రిమాండ్ కు పంపింది. ఇదే క్రమంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
మార్గదర్శి కార్యాలయాల్లో తాజాగా నిర్వహించిన దాడుల్లో లభించిన ఆధారాల ఆధారంగా పలు చర్యలకు దిగుతున్న స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు అక్రమాలు తేలితే సంస్ధను మూసేస్తామని కూడా తాజాగా హెచ్చరికలు చేశారు. ఇదే క్రమంలో ఇప్పుడు మార్గదర్శిలో అక్రమాలపై స్టాంప్స్&రిజిస్టేషన్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్గదర్శిలో ప్రత్యేక ఆడిటింగ్ కోసం స్పెషల్ ఆడిటర్ ను ప్రభుత్వం నియమించింది. మార్గదర్శి చిట్ ఫండ్‍లో నిధుల మళ్లింపు, అక్రమ డిపాజిట్ల సేకరణ నేపథ్యంలో ప్రత్యేక ఆడిటర్ నియామకం జరిగినట్లు తెలుస్తోంది. మార్గదర్శికి చెందిన 37 బ్రాంచ్‍లలో ఆడిటింగ్ నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు.

మార్గదర్శి చిట్స్ లో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని సంస్ధ చెబుతుండగా.. ఫిర్యాదులు లేకపోయినా తమంతట తామే నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇదే క్రమంలో మార్గదర్శి కార్యాలయాలపై దాడులు చేస్తోంది. ఇందులో లభించిన ఆధారాల ఆధారంగా ఇప్పుడు స్పెషల్ అడిటర్ ను నియమించి మరీ ఈ వ్యవహారాన్ని మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు సిద్ధమవుతోంది. ఓవైపు సీఐడీ, మరోవైపు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ దాడులతో మార్గదర్శి ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ విచారణ మరిన్ని మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications