Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జడ్డీలతో జగన్ పోరు సశేషం ? రాజధానుల విచారణతో మరోసారి తెరపైకి-హైకోర్టు మార్పుపై చర్చ

ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు హైకోర్టులో చుక్కెదురైంది. దీంతో ఏపీ ప్రభుత్వాన్ని అస్ధిర పరిచేందుకు జడ్డీలు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణల్ని జగన్ సర్కార్ తెరపైకి తెచ్చింది. తద్వారా తమ ప్రభుత్వానికి కోర్టులు వ్యతిరేకమన్న భావనను ప్రజల్లోకి పంపేందుకు ప్రయత్నించింది. కానీ ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ అరోపణల్లో పస లేదని తేల్చింది. అయితే ఇప్పుడు జగన్ సర్కార్ మరోసారి ఇద్దరు జడ్డీల్ని కొత్త అనుమానాలతో రాజధాని కేసుల విచారణ నుంచి తప్పించాలని కోరడంతో ఈ వ్యవహారం మళ్లీ కలకలం రేపింది.

 జగన్ వర్సెస్ జడ్డీలు

జగన్ వర్సెస్ జడ్డీలు

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో పలు నిర్ణయాలు పూర్తిగా ప్రజల కోణం నుంచి తీసుకున్నవే. ఇలాంటి నిర్ణయాలపై హైకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులతో తమ ప్రభుత్వం అస్ధిరమవుతుందని వైసీపీ సర్కార్ భావించింది. ఇవే అరోపణలతో అప్పటి సుప్రీంకోర్టు సీజే బాబ్డేకు సీఎం జగన్ లేఖ కూడా రాశారు.

అంతటితో ఆగకుండా ఆ రహస్య లేఖను తన సలహాదారుతో బయటపెట్టించారు. దీంతో దేశవ్యాప్తంగా జగన్ వర్సెస్ జడ్డీల పోరుగా ఈ వ్యవహారం కలకలం రేపింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు విచారణ జరిపి జగన్ ఆరోపణల్ని తోసిపుచ్చింది. దీంతో కొంతకాలంగా దీనిపై వైసీపీ సర్కార్ మౌనంగానే ఉంటోంది.

 రాజధానుల విచారణతో మరోసారి

రాజధానుల విచారణతో మరోసారి

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ దాఖలైన వందకు పైగా పిటిషన్ల విచారణను ఈసారి హైకోర్టు సీరియస్ గా తీసుకుంటోంది. ప్రజా ప్రయోజనంతో ముడిపడి ఉన్న ఈ పిటిషన్లను సాధ్యమైనంత త్వరగా తేల్చేస్తామని కూడా నిన్న సీజే ప్రకటించారు. ఈ సమయంలో జగన్ సర్కార్ హైకోర్టు సీజే దృష్టికి ఓ సీరియస్ అంశాన్ని తీసుకెళ్లింది.

తద్వారా ఈ పిటిషన్ల విచారణపై పడే ప్రభావాన్ని సీజేకు తెలిపింది. అయితే ఈ వ్యవహారం న్యాయమూర్తులతో లింక్ అయినది కావడంతో రాజధాని పిటిషన్ల విచారణ తొలిరోజే కలకలం రేగింది. చివరికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ మిశ్రా జోక్యం చేసుకుని దీనికి ఫుల్ స్టాప్ పెట్టారు.

 జడ్డీలపై జగన్ సర్కార్ ఆరోపణలు

జడ్డీలపై జగన్ సర్కార్ ఆరోపణలు

రాజధానుల పిటిషన్లను విచారిస్తున్న హైకోర్టు త్రిసభ్య ధర్మాసనంలో సీజే ప్రశాంత్ మిశ్రాతో పాటు జస్టిస్ సత్యనారాయణమూర్తి, జస్టిస్ సోమయాజులు ఉన్నారు. సీజే ప్రశాంత్ మిశ్రా బదిలీపై ఇక్కడికి రాగా.. మిగతా ఇద్దరూ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తులు కూడా. అయితే వీరిద్దరిపై సంచలన ఆరోపణలు చేస్తూ హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి కేసు విచారణపైనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఇద్దరు న్యాయమూర్తుల్ని విచారణ నుంచి తప్పించాలని కోరారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

చంద్రబాబు హయాంలో భూములు తీసుకున్నారనే

చంద్రబాబు హయాంలో భూములు తీసుకున్నారనే

చంద్రబాబు హయాంలో అమరావతి రాజధాని ఏర్పాటు సందర్భంగా న్యాయమూర్తుల కోసం జ్యుడిషియల్ సిటీ నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా అప్పటి హైకోర్టు న్యాయమూర్తులందరికీ ఇందులో భూములు కేటాయించారు. ఇలా చంద్రబాబు హయాంలో భూములు తీసుకున్న న్యాయమూర్తుల్లో ప్రస్తుతం రాజధానుల పిటిషన్లు విచారణ చేస్తున్న జస్టిస్ సత్యనారాయణమూర్తి, జస్టిస్ సోమయాజులు కూడా ఉన్నారు. దీంతో వీరిద్దరూ చంద్రబాబు హయాంలో అమరావతిలో భూములు తీసుకున్నారు కాబట్టి రాజధానుల పిటిషన్ల విచారణకు వీరిద్దరూ అనర్హులంటూ ప్రభుత్వం హైకోర్టు సీజే దృష్టికి తీసుకొచ్చింది.

జగన్ సర్కార్ అనుమానాలివే

జగన్ సర్కార్ అనుమానాలివే

రాజధానుల పిటిషన్లు విచారిస్తున్న త్రిసభ్య ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ సత్యనారాయణమూర్తి, జస్టిస్ సోమయాజులు చంద్రబాబు హయాంలో భూములు తీసుకున్నారు కాబట్టి వీరు చేసే విచారణ, ఇచ్చే తుది తీర్పుపై కచ్చితంగా ఆ ప్రభావం ఉంటుందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. రాజధానుల పిటిషన్లపై తుది తీర్పు న్యాయమూర్తుల ఆర్ధిక ప్రయోజనాలతో ముడిపడి ఉన్నందున వారు విచారణకు అనర్హులవుతారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదించారు. దీంతో ఈ వ్యవహారం కూడా మరో క్విడ్ ప్రోకో అనే అనుమానాలు వ్యక్తం చేశారు.

 నన్నుకూడా తప్పుకోమంటారా అని సీజే ప్రశ్న

నన్నుకూడా తప్పుకోమంటారా అని సీజే ప్రశ్న

చంద్రబాబు హయాంలో భూములు తీసుకున్నారనే కారణంతో రాజధానుల కేసు విచారణ నుంచి ఇధ్దరు న్యాయమూర్తుల్ని తప్పించాలని వైసీపీ సర్కార్ కోరడాన్ని హైకోర్టు సీజే ప్రశాంత్ మిశ్రా తీవ్రంగా తప్పుబట్టారు. న్యాయమూర్తులకు అమరావతిలో ప్లాట్ల కేటాయింపు చంద్రబాబు సర్కార్ తీసుకున్న విధానపరమైన నిర్ణయమని, ఆర్ధిక పరమైన ప్రయోజనం ఇందులో ఎక్కడుందని ప్రశ్నించారు.

అంతే కాదు తాను కూడా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నాను కాబట్టి నన్ను కూడా విచారణ నుంచి తప్పుకోమంటారా అని ప్రశ్నించారు. ఇలాంటి పిటిషన్లను అనుమతిస్తే రిపీట్ అయ్యే అవకాశం ఉందని అందుకే తోసిపుచ్చుతున్నట్లు సీజే తెలిపారు. హైకోర్టు విచారణపై అభ్యంతరాలుంటే సుప్రీంను ఆశ్రయించి మరో హైకోర్టుకు విచారణను మార్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

Recommended Video

    AP Cabinet : APలో కేబినెట్ విస్తరణ.. ప్రశాంత్ కిషోర్ మంత్రాంగం..!! || Oneindia Telugu
    జడ్డీలతో జగన్ పోరు సశేషం?

    జడ్డీలతో జగన్ పోరు సశేషం?

    గతంలో చంద్రబాబు హయాంలో భూములు పొందిన న్యాయమూర్తులు తన ప్రభుత్వ పాలనకు అడ్డుపడుతున్నారనే ఆరోపణలు చేసిన సీఎం జగన్.. ఇప్పుడు రాజధానుల విచారణకూ అదే విషయాన్ని తెరపైకి తెచ్చారు. తద్వారా చంద్రబాబు హయాంలో జడ్డీలకు భూములు ఇచ్చారన్న అంశం చుట్టూనే జగన్ సర్కార్ తిరుగుతున్నట్లు కనిపిస్తోంది.

    ఈ లెక్కన చూస్తే రేపు రాజధాని పిటిషన్ల విచారణ పూర్తయి తీర్పు వచ్చాక కూడా అదే విషయాన్ని వైసీపీ సర్కార్ ప్రస్తావించే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు రాజధాని పిటిషన్లపై విచారణ త్వరగా జరగాలని కోరుకుంటున్న జగన్ సర్కార్.. ఆరంభంలోనే విచారణ జరుపుతున్న బెంచ్ లోని న్యాయమూర్తులపై అనుమానాలు వ్యక్తం చేయడం చర్చనీయాంశమవుతోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+