మందుబాబులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్-డిజిటల్ పేమెంట్స్-ఫోన్ పే, గూగుల్ పే-ఎన్నో లాభాలు
ఏపీలో మద్య నిషేధం పాక్షికంగా అమలు చేస్తున్నట్లు చెబుతున్న జగన్ సర్కార్.. భవిష్యత్తులో దీనిపై వచ్చే ఆదాయంపై భారీ ప్రణాళికలే రచిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి వేల కోట్లు రుణాలు తెచ్చుకుంటున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఈ వ్యవస్ధలో అక్రమాల నివారణ పేరుతో డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతోంది. ప్రస్తుతం మద్యం దుకాణాల్లో నగదు చెల్లింపులు మాత్రమే జరుగుతుండగా.. త్వరలో గూగుల్ పే, ఫోన్ పే, కార్డుల ద్వారా కూడా మద్యం కొనుక్కునేలా సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది.

ఏపీలో మద్య నిషేధం
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న మద్యం దుకాణాల్ని రద్దు చేసి వాటిని తమ అధీనంలోని తెచ్చుకుంది. ఆ తర్వాత మద్య నిషేధం పేరుతో ఏటా కొన్ని షాపుల్ని తొలగిస్తూ ఐదేళ్లలో పూర్తిగా మద్య నిషేధం అమలు చేస్తామని జగన్ సర్కార్ ప్రకటించింది. కానీ ఏడాది గడిచిందో లేదో మద్యం ఆదాయం లేకుండా ప్రభుత్వాన్ని నడపడం ఎంత కష్టమో ప్రభుత్వానికి తెలిసొచ్చింది. అంతే అప్పటి నుంచి మద్యం దుకాణాల తొలగింపు ఊసే లేకపోగా.. పర్యాటకం పేరుతో కొత్త కొత్త తరహాలో మద్యం అమ్మకాలకు తెరలేపింది. దీంతో మద్యనిషేధం అటకెక్కినట్లయింది.

మద్యం ఆదాయమే కొండంత అండ
మద్యం ద్వారా ఏటా లభించే ఆదాయంతోనే ఉమ్మడి రాష్ట్రం నుంచీ ప్రభుత్వాలు మనుగడ సాగిస్తున్నాయి. మద్యం అమ్మకాలకు టార్గెట్లు పెట్టి మరీ అమ్మించే పరిస్ధితి ఎప్పటినుంచో ఉంది. అలాంటి నేపథ్యంలో వైసీపీ సర్కార్ తొలుత మద్య నిషేధం అని చెప్పినా అనతికాలంలోనే దానికి మంగళం పాడేసింది. చివరికి మద్యం ఆదాయాన్ని పెంచుకోవడానికి తగినన్ని మార్గాలు వెతుకుతోంది. దీంతో మద్యం ఆదాయం ఏటికేడాది పెరుగుతూనే ఉంది. ఈ ఆదాయాన్ని తాకట్టు పెట్టి కొత్త రుణాలు తెచ్చుకునేందుకు సైతం వీలు కలుగుతోంది. దీంతో మద్యం ఆదాయం గత ప్రభుత్వాల తరహాలోనే జగన్ సర్కార్ కూ ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయింది.

నాసిరకం బ్రాండ్లతోనే కోట్ల వ్యాపారం
ఏపీలో ప్రస్తుతం లభిస్తున్న మద్యం బ్రాండ్లు దేశంలో ఎక్కడా దొరకనివి, నాసిరకమైనవి. వీటిని ప్రజలపై రుద్దడం ద్వారా మద్యనిషేధం దిశగా అడుగులేస్తున్నట్లు ప్రభుత్వం గతంలో ఘనంగా చెప్పుకుంది. కానీ మారిన పరిస్దితుల్లో ఈ నాసిరకం బ్రాండ్లే గతి కావడంతో మందుబాబులు కూడా వీటినే అలవాటు చేసుకున్నారు. దీంతో ప్రభుత్వం ఆశించిన ఫలితం అందుకుంది. నాసిరకం బ్రాండ్లు కూడా భారీ ధరలకు అమ్ముతుండటంతో వాటినే అలవాటుపడుతున్న మందుబాబులు వాటి కోసం భారీ మొత్తాల్ని వెచ్చించి మరీ కొంటున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయం కూడా మూడు పువ్వులు ఆరుకాయలుగా పెరుగుతోంది.

ఆదాయానికి అక్రమాల గండి
మద్యం అమ్మకాల రూపంలో కోట్లాది రూపాయల ఆదాయం ప్రభుత్వానికి రావాల్సి ఉన్నా పలుచోట్ల జరుగుతున్న అక్రమాలతో వాటికి భారీగా గండిపడుతోంది. ముఖ్యంగా మద్యం షాపుల్లో సిబ్బంది చేతివాటంతో పాటు రవాణాలోనూ అక్రమాలు చేటు చేసుకుంటుండటంతో ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లిపోతోంది. దీంతో ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడుతోంది. ప్రభుత్వం అనుకున్న విధంగా ఆదాయం సమకూరడం లేదు. కాబట్టి మద్యం అమ్మకాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో సాయంతో ఓవైపు ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు ఆదాయం పెంపు కోసం కొత్త కొత్త దారులు వెతుకుతోంది. త్వరలో వీటిని అమల్లోకి తీసుకురానుంది.

డిజిటల్ చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్
మద్యం అమ్మకాల ద్వారా వస్తున్న ఆదాయానికి స్ధానికంగా షాపుల్లో ఉండే సిబ్బంది చేతివాటాలతో గండి పడుతున్న నేపథ్యంలో బహిరంగ మార్కెట్ తరహా ఇక్కడ కూడా డిజిటల్ చెల్లింపుల్ని పోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సాఫ్ట్ వేర్ మార్పులతో పాటు ఇతర ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం మద్యం షాపుల్లో ఏపీ ఆన్ లైన్ సాఫ్ట్ వేర్ వాడుతుండగా.. మరో రెండు నెలల్లో దీని గడువు పూర్తి కాబోతోంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ ఫామ్ ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాబోతోంది. దీంతో మద్యం షాపుల్లోనూ డిజిటల్ పేమెంట్స్ కు వీలు కలుగనుంది.
Recommended Video

గూగుల్ పే, ఫోన్ పే ద్వారా మద్యం
ఇప్పటివరకూ నగదు చెల్లింపుల ద్వారానే మద్యం షాపుల్లో మద్యం దొరుకుతోంది. మరో రెండు నెలల్లో ప్రభుత్వం ప్రారంభించనున్న డిజిటల్ చెల్లింపుల విధానం ద్వారా గూగుల్ పే, ఫోన్ పే, డెబిట్, క్రెడిట్ కార్డుల స్వైపింగ్ ద్వారా కూడా మద్యం లభించనుంది. అలాగే పరోక్ష విధానంలో ఇంటి వద్ద ఉండి కూడా ఈ-పేమెంట్స్ చేసి మద్యం కొనుగోలు చేసేందుకు వీలు కలగబోతోంది. తద్వారా మద్యం షాపుల్లో అక్రమాలకు తెరపడటంతో పాటు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా భారీగా పెరుగుతుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. అలాగే బేవరేజెస్ కార్పోరేషన్ తో పాటు ఇతర కార్పోరేషన్ల ద్వారా ప్రభుత్వం తెచ్చుకునే అప్పుల విషయంలోనూ మద్యం ఆదాయం పెరుగుదల ఉపయోగపడబోతోంది. దీంతో రాబోయే రోజుల్లో మరిన్ని అప్పులు తెచ్చుకునేందుకు కూడా ఈ ఆదాయం ఉపయోగపడనుంది. దీంతో ఈ కొత్త విధానం ద్వారా అన్ని విధాలుగా మేలు జరుగుతుందని జగన్ సర్కార్ అంచనా వేస్తోంది. అదే సమయంలో మందు బాబులకు కూడా డిజిటల్ చెల్లింపులతో చిల్లర వెతుక్కోవాల్సిన అగత్యం తప్పనుంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications