వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హాజరుకు ఇబ్బందేంటి?: జగన్ ‘వ్యక్తిగత హాజరు మినహాయింపు’పై 23న తీర్పు

అక్ర‌మాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌తి శుక్ర‌వారం కోర్టులో హాజ‌రవుతోన్న విష‌యం తెలిసిందే. అయితే, నవంబర్ 2 నుంచి తాను పాద‌యాత్ర చేయ‌నున్న నేప‌థ్యంలో ఆరు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అక్ర‌మాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌తి శుక్ర‌వారం కోర్టులో హాజ‌రవుతోన్న విష‌యం తెలిసిందే. అయితే, నవంబర్ 2 నుంచి తాను పాద‌యాత్ర చేయ‌నున్న నేప‌థ్యంలో ఆరు నెల‌ల పాటు త‌న‌కు కోర్టులో వ్య‌క్తిగ‌త హాజ‌రుపై మిన‌హాయింపు ఇవ్వాల‌ని ఆయ‌న వేసిన పిటిష‌న్‌పై శుక్రవారం సీబీఐ కోర్టులో మ‌రోసారి విచార‌ణ జ‌రిగింది.

జగన్ తరపు న్యాయవాది, సీబీఐ తరపు న్యాయవాదులు తమ వాదనను వినిపించారు. జగన్ చేపట్టనున్న పాదయాత్రకు ఇబ్బంది లేకుండా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ తరపు న్యాయవాది వాదించారు. పాదయాత్ర సమయంలో కోర్టుకు హాజరుకావడం కష్టమవుతుందని వివరించారు.

Jagan’s plea for exemption from appearance: The court verdict on October 23

అందువల్ల జగన్మోహన్ రెడ్డికి ఆరు నెలలపాటు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. కాగా, విచారణ తప్పించుకునేందుకు జగన్ పిటిషన్ వేశారని సీబీఐ వాదించింది. జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లోనూ మినహాయింపు ఇవ్వవద్దని కోరింది. జ‌గ‌న్ త‌రుఫు న్యాయ‌వాది వాద‌న‌లతో పాటు సీబీఐ వినతిని విన్న కోర్టు ఈ పిటిష‌న్‌పై నిర్ణ‌యాన్ని అక్టోబర్ 23న ప్ర‌క‌టిస్తామ‌ని వెల్ల‌డించింది.

మీకు అంత ఇబ్బందేమిటి?: జగన్‌కు కోర్టు ప్రశ్న

వారానికి ఒక్కసారి జరిగే విచారణకు హాజరైతే వచ్చే ఇబ్బందేమిటంటూ సీబీఐ కోర్టు వ్యాఖ్యానించింది. ఒక పౌరుడిగా కోర్టుల పట్ల గౌరవంతో హాజరవుతున్నానని ప్రజలకు చెప్పవచ్చంది. వారం మొత్తం పాదయాత్ర నిర్వహించి ఒక్క శుక్రవారం కోర్టుకు రావచ్చని, దీని వల్ల కొంత విశ్రాంతి కూడా లభించినట్లుంటుందని పేర్కొంది. ప్రస్తుతం వర్షాకాలంలో వర్షాలు ఎక్కువైనపుడు యాత్రకు విరామం ఉంటుంది కదా అని అడిగింది.

English summary
The CBI court will issue verdict on October 23 in YS Jaganmohan Reddy’s plea for exemption from appearance petition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X