క్షమాపణ చెప్పండి: షర్మిల, ఇదిగో రాజీనామా(పిక్చర్స్)
హైదరాబాద్/గుంటూరు: సిడబ్ల్యూసి విభజన నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల బుధవారం డిమాండ్ చేశారు. ఆమె సమైక్య శంఖారావ యాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
ఏఐసిసి ఉపాధ్యక్షురాలు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం విభజన కుట్ర చేస్తోందని, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలకు కిరణ్ తూట్లు పొడుస్తున్నారన్నారని ఆరోపించారు. విభజన చిచ్చుతో రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలా కూర్చున్నారన్నారు.
రాష్ట్ర విభజన లేఖను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎందుకిచ్చారని, ఆత్మ గౌరవ యాత్ర చేస్తున్న ఆయనకు అసలు ఆత్మగౌరవం ఉందా? అని ప్రశ్నించారు. మరోవైపు, ప్రకాశం జిల్లా ఒంగోలులో పలువురు సమైక్యవాదులు ప్రజాప్రతినిధులను అడ్డుకొని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన తన రాజీనామా లేఖను చూపించారు.

మాట్లాడుతున్న షర్మిల
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల సమైక్య శంఖారావ యాత్ర బుధవారం గుంటూరు జిల్లాలో సాగింది.

జన సందోహం
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల సమైక్య శంఖారావ యాత్ర బుధవారం గుంటూరు జిల్లాలో వచ్చిన జన సందోహం.

ఒంగోలు
ప్రకాశం జిల్లా ఒంగోలులో సమైక్యాంధ్ర పరిరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమ నాయకులు.

మానవ హారం
సిడబ్ల్యూసి విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలులో మానవ హారం నిర్వహించిన సమైక్యవాదులు. వీరు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు.

నిరవధిక సమ్మె
సిడబ్ల్యూసి విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలులో ర్యాలీ నిర్వహించిన సమైక్యవాదులు. వీరు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు.

సమైక్యమనండి!
సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం రాజీనామా చేయాలంటూ పలువురు నాయకులను నిలదీస్తున్న సమైక్యవాదులు. ప్రకాశం జిల్లా ఒంగోలులో సమైక్యవాదులు నిలదీస్తున్న దృశ్యం.

రాజీనామా లేఖ
సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం రాజీనామా చేయాలంటూ పలువురు నాయకులను నిలదీస్తున్న సమైక్యవాదులు. ప్రకాశం జిల్లా ఒంగోలులో సమైక్యవాదులు నిలదీస్తున్న దృశ్యం. నేతలు తమ రాజీనామా పత్రాలను చూపించారు.

సమైక్యమే..
సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం రాజీనామా చేయాలంటూ పలువురు నాయకులను నిలదీస్తున్న సమైక్యవాదులు. ప్రకాశం జిల్లా ఒంగోలులో సమైక్యవాదులకు నచ్చచెప్తున్న దృశ్యం.

సమైక్యాంధ్ర
ప్రకాశం జిల్లా ఒంగోలులో సమైక్యాంధ్ర కోసం దీక్ష చేస్తున్న సమైక్యవాదుల దృశ్యం. సమైక్యాంధ్రకు మద్దతుగా వారు జోరుగా నినాదాలు చేశారు.

గ్రామీణ ఉపాధి మేట్ల సంఘం
ప్రకాశం జిల్లా ఒంగోలులో సమైక్యాంధ్ర కోసం గ్రామీణ ఉపాధి మేట్ల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ తీస్తున్న దృశ్యం. ఈ ర్యాలీలో పలువురు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications