గోల్డ్ మెడల్ సాధించినట్లా: జగన్‌ను ఏకేసిన సోమిరెడ్డి

 Jagan should quit as opposition leader: Somireddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం నిప్పులు చెరిగారు. ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. 11 ఛార్జీషీట్లలో ఏ1గా ఉన్న జగన్ గోల్డ్ మెడల్ సాధించినట్లా అని ఎద్దేవా చేశారు.

పుచ్చలపల్లి సుందరయ్య, ఎన్టీఆర్, చంద్రబాబు వంటి మహామహులు కూర్చన్న ప్రతిపక్ష స్థానంలో జగన్‌కు కూర్చునే అర్హత లేదన్నారు. అతిపెద్ద ఆర్థిక నేరస్తుడైన జగన్ ప్రతిపక్ష నేతగా ఎలా ఉంటారని ప్రశ్నించారు. మహానుభావులు కూర్చున్న చోట ఆయనకు కూర్చునే అర్హత ఏమాత్రం లేదన్నారు.

జగన్ తన దురాశతో రూ.43వేల కోట్లను దుర్వినియోగం చేశారని, వందమందికి పైగా దోషులుగా తయారు చేశారని ఆరోపించారు. జగన్‌ను దొంగ, దోపిడీదారు.. ఇలా ఏమని పిలవాలో చెప్పాలన్నారు. తాను జగన్ పైన కక్షతో చెప్పడంలేదని, ఇన్ని ఛార్జీషీట్లలో ఏ1గా ఉన్న జగన్‌ను ఏమని పిలవాలో వారే చెప్పాలన్నారు.

కొద్ది రోజుల క్రితం ఏపీలో నరకాసుర వధకు పిలుపినిచ్చి భ్రష్టు పట్టించారన్నారు. జగన్‌కు రాజకీయాల్లో ఉండే అర్హత ఏమాత్రం లేదన్నారు. ఇప్పటికైనా జగన్ చేసిన తప్పులను అంగీకరించి రాజకీయాల నుండి వైదొలగాలన్నారు. వైయస్ హయాంలో జరిగిన దోపిడీని కాగ్ ఎండగట్టిందన్నారు. అడ్డూ అదుపు లేకుండా జగన్ దోపిడీ సాగిందన్నారు. జగన్ దోపిడీతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+