ఇవిగో సాక్ష్యాలు..క్రెడిట్ ఎలా కొట్టేస్తారు ?-బాబుపై జగన్ ఫైర్..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల రీసర్వే, దానికి కేంద్రం, నీతి ఆయోగ్ నుంచి లభించిన ప్రశంసలు గుర్తుచేస్తూ.. ఆ క్రెడిట్ ను చంద్రబాబు ప్రభుత్వం ఎలా కొట్టేస్తుందని వైఎస్ జగన్ ఇవాళ ప్రశ్నించారు. రాష్ట్రంలో భూముల రీసర్వే క్రెడిట్ కొట్టేసేందుకు కూటమి సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను జగన్ ఇవాళ తప్పుబట్టారు. అప్పట్లో భూముల రీసర్వే కోసం తాము చేసిన అన్ని ప్రయత్నాలను ఇవాళ జగన్ బయటపెట్టారు.
భూముల రీసర్వే చేయాలన్న ఆలోచన కూడా చంద్రబాబుకు ఎప్పుడూ రాలేదని, తన పాదయాత్ర సమయంలో రైతులు లేవనెత్తిన సమస్యలకు పరిష్కారంగా తాను ఈ ఆలోచన చేసినట్లు జగన్ వెల్లడించారు. తాము అధికారంలోకి రాకముందు తగినంత మంది సర్వేయర్లు లేరని, టెక్నాలజీ కూడా లేదని గుర్తుచేశారు. 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలోనే భూముల రీసర్వే చేయిస్తామని పెట్టి మరీ తాము అధికారంలోకి రాగానే దీన్ని చేపట్టామన్నారు.

2020 డిసెంబర్ 1న తాము భూముల రీసర్వే ప్రారంభించామని జగన్ తెలిపారు. భూ వివాదాలు లేని విధంగా, రికార్డులు ట్యాంపర్ కాని విధంగా ఈ సర్వే చేశామన్నారు. వీటి ద్వారా భూయజమానులకు శాశ్వత పత్రాలు ఇచ్చామని, రైతులకు ప్రభుత్వ పూచీకత్తుతో పత్రాలు ఇచ్చామని తెలిపారు. క్యూఆర్ కోడ్ తో రైతులకు పాస్ బుక్స్ కూడా ఇచ్చామన్నారు. ఇదంతా రికార్డుల్లో ఉందని, దీన్ని ఎవరూ తుడిచిపెట్టలేరని జగన్ స్పష్టం చేశారు.
సర్వే కోసం గ్రామ సచివాలయాల్లో పది మంది సిబ్బంది నియామకం, రికార్డు స్ధాయిలో శిక్షణ ఇచ్చిన క్షేత్రస్థాయి సిబ్బందిని
నియమించామన్నారు. సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుని, డ్రోన్లు, హెలికాప్టర్లతో సర్వే చేశామన్నారు. కోట్ల సర్వే రాళ్లను గ్రామాలకు పంపి వాటిని రైతులకు ఉచితంగా ఇచ్చామన్నారు. భూసర్వే కోసం 6 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈ కృషికి గుర్తింపుగా కేంద్రం ప్లాటినం గ్రేడ్ ఇచ్చిందని, నీతి ఆయోగ్ ప్రశంసించిందని తెలిపారు. దీంతో కేంద్రం నుంచి 400 కోట్ల రాయితీ కూడా లభించిందన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుని మొదలుపెట్టాయన్నారు.

చంద్రబాబు మాత్రం ఇదంతా తన క్రెడిట్ అంటున్నారని జగన్ ఎద్దేవా చేశారు. సర్వే రాళ్లు లేకుండా చంద్రబాబు సర్వే చేయిస్తున్నారని, ఏదో ఒక రాయి పెట్టి సర్వే రాయి అంటున్నారని ఆరోపించారు. పాస్ బుక్ లకు కూడా తాము చేసిందే చేసి కేవలం రంగు మార్చి ఇస్తున్నారన్నారు. వాటిలోనూ తప్పులే ఉంటున్నాయన్నారు. సర్వే రాళ్లపై మా పేర్ల తొలగింపుకు 15 కోట్లు ఖర్చు చేశారన్నారు. 22ఏలో అడ్డగోలుగా భూములు పెట్టిన చంద్రబాబు.. పట్టాదారు పాసుపుస్తకాలనూ కమిషన్లు తీసుకుని ఇస్తున్నారన్నారు. చుక్కల భూములు, ఇనాం భూముల సమస్యలు పరిష్కరించి, ఆదివాసీల భూహక్కులు కల్పించిన చరిత్ర తమదని గుర్తుచేశారు.
-
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
టీడీపీ ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు సీరియస్-తక్షణం..! -
ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్-బకాయిలపై చంద్రబాాబు ఆదేశాలు..! -
కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే.. అలా చేస్తానంటూ వైసీపీ నేత వార్నింగ్ ! -
ఒంటిమిట్ట కోదండ రామస్వామి కల్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!!












Click it and Unblock the Notifications