జగన్ సంచలన నిర్ణయం..పార్టీ ప్రక్షాళన..వారు అవుట్..!

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘెర ఓటమిని మూటగట్టుకుంది. 2019 ఎన్నికల్లో 151 సీట్లలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ,తీవ్ర ప్రజాగ్రాహానికి లోనై కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించగలిగింది. 2019 ఎన్నికల్లో 22 పార్లమెంట్ స్థానాలకు గెలుచుకున్న ఆ పార్టీ ఈసారి నాలుగు పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు సైతం బద్దలయ్యాయి. ప్రతిపక్ష హోదాకు కావాల్సిన సీట్లను కూడా ఆ పార్టీ సాధించలేకపోయింది.

ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ డిమాండ్ చేస్తున్నప్పటికి , కూటమి ప్రభుత్వం ఆయన్ను లెక్కలోకి తీసుకోవడం లేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నేతలంతా డీలా పడ్డారు.కొంతమంది నాయకులు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు.

పార్టీ దారుణంగా ఓడిపోవడంతో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడ నష్టపోకుండా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందడుగులు వేయడానికి జగన్ సిద్ధమయ్యారు. దీనిలో భాగంగానే వైసీపీలో ప్రక్షాళన షూరు చూశారు. సొంత జిల్లాల నుంచే పార్టీ ప్రక్షాళన మొదలుపెట్టారు. ఈక్రమంలోనే జిల్లా అధ్యక్ష పదవులను ప్రకటించారు. ఉమ్మడి కడప జిల్లా వైసీపీకి కంచుకోటగా ఉండేది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఈ కోటకు బీటలు వారాయి. ఉమ్మడి కడప జిల్లాలోని 10 నియోజకవర్గాలలో మూడు అంటే మూడు స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలుచుకోగలిగింది.

Jagan started cleansing from his own district

అందుకే ముందుగా కడప, అన్నమయ్య జిల్లాల ఇంచార్జ్‌లను మార్చి తనదైన శైలిలో రాజకీయాలను మొదలుపెట్టారు. కడప జిల్లాకు సొంత మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. అలాగే ఆయన కుమారుడు నరేన్ రామానుజన్ రెడ్డిని కమలాపురం ఇంచార్జ్‌గా నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీకాంత్ రెడ్డిని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని జిల్లా అధ్యక్షులుగా నియమించారు.

అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీకాంత్ రెడ్డిని తప్పించి జగన్, ఆయనకు ఉన్నత పదవిని అప్పగించారు. పార్టీ సమన్వయ ప్రధాన కార్యదర్శిగా గడికోట శ్రీకాంత్‌రెడితో పాటు వేంపల్లి సతీష్‌రెడ్డిలను ప్రకటించారు. పార్టీ మరో ప్రధాన కార్యదర్శి (అనుబంధ విభాగాలు)గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేరును ఖారారు చేశారు. యువజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి రాజా ,బీసీ సెల్‌ అధ్యక్షుడు రమేష్‌ యాదవ్‌,ఎస్సీ సెల్‌ అధ్యక్షుడిగా టీజేఆర్‌ సుధాకర్‌ చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవి,విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పానుగంటి చైతన్య, ఏలూరు జిల్లా అధ్యక్షడిగా దూలం నాగేశ్వరరావు పేర్లను జగన్ ఖారారు చేశారు. ఏది ఏమైనా పార్టీని మరింత బలోపేతం చేయాలంటే ముందు సొంత జిల్లా నుంచే మార్పులు చేర్పులు చేస్తే గాని పార్టీ బలోపేతం కాదనే ఉద్దేశంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+