చంద్ర‌బాబు విధేయుల‌కు జ‌ల‌క్‌: జ‌గ‌న్ న‌యా టీం: చ‌క్రం తిప్పిందెవ‌రు...ఆయ‌న మాట సాగ‌లేదా..!

ఏపీ సీఎం జ‌గ‌న్ పాల‌న‌లో త‌న మార్క్ చూపిస్తున్నారు. ఇందు కోసం గ‌తంలో చంద్ర‌బాబుకు విధేయులుగా ప‌ని చేసిన అధికారుల‌కు జ‌ల‌క్ ఇచ్చారు. ఏకంగా తొమ్మ‌ది మంది క‌లెక్ట‌ర్ల‌తో స‌హా 45 మందిని బ‌దిలీ చేసారు. కీల‌మైన శాఖ‌ల‌కు వైయ‌స్ హ‌యాంలో ప‌ని చేసిన అధికారుల‌కు అప్ప‌గించారు. అయితే, జ‌గ‌న్ త‌రువాతి స్థానంగా పార్టీలో ఉండే వ్య‌క్తి రిక‌మండ్ చేసిన పేర్ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌ని..త‌న‌కు ఉన్న స‌మాచారంతోనే పోస్టింగ్‌లు ఇచ్చార‌ని స‌మాచారం.

నాటి అనుయాయుల‌కు నో పోస్టింగ్‌..

నాటి అనుయాయుల‌కు నో పోస్టింగ్‌..

చంద్ర‌బాబు హాయంలో ఒక వెలుగు వెలిగిన అధికారుల‌కు జ‌గ‌న్ జ‌ల‌క్ ఇచ్చారు. చంద్ర‌బాబు త‌న సొంత జిల్లాకు ఏరి కోరి వేసుకున్న క‌లెక్ట‌ర్ మొద‌లు స‌చివాల‌యంలోని కీల‌క శాఖ‌ల ముఖ్య కార్య‌ద‌ర్శుల వ‌ర‌కు బ‌దిలీ చేసారు. సీఆర్‌డిఏ క‌మిష‌న‌ర్‌గా టీడీపీ హ‌యాంలో కీల‌క భూమిక పోషించిన శ్రీధ‌ర్‌ను త‌ప్పించి ఎక్క‌డా పోస్టింగ్ ఇవ్వ‌లేదు. ఆయన స్థానంలో నిజాయితీప‌రుడైన అధికారిగా పేరున్న ల‌క్ష్మీ న‌ర‌సింహంకు సీఆర్‌డిఏ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అదే విధంగా ఇరిగేష‌న్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా ఉన్న శ‌శిభూష‌ణ్ స్థానంలో గ‌తంలో వైయ‌స్ హ‌యాంలో భారీ నీటి పారుద‌ల ముఖ్య కార్య‌ద‌ర్శిగా ప‌ని చేసిన ఆధిత్యనాధ్ దాస్‌కు అప్ప‌గించారు. తానే ప‌ర్య‌వేక్షించాల‌ని నిర్ణ‌యించిన వైద్య ఆరోగ్య శాఖ బాధ్య‌త‌ల‌ను జ‌వ‌హ‌ర్ రెడ్డికి కేటాయించారు. జ‌గ‌న్ గెల‌వ‌గానే వ‌చ్చి అభినందించిన ఎంటి కృష్ణ‌బాబుకు రోడ్డు ర‌వాణా శాఖ బాధ్య‌త‌లను జ‌గ‌న్ అప్ప‌గించారు.

అజ‌య్‌జైన్..విజ‌యానంద్‌కు షాక్..

అజ‌య్‌జైన్..విజ‌యానంద్‌కు షాక్..


రాజ‌ధాని వ్య‌వ‌హారాల్లో కీల‌క భూమిక పోషించిన అజ‌య్ జైన్ చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ముఖ్య అధికారిగా ఉండేవారు. ఆయ‌న‌ను తాజ‌గా బ‌దిలీ చేసిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆయ‌న స్థానంలో శ్రీకాంత్‌కు ఆ బాద్య‌త‌లు అప్ప‌గించారు. అయితే అజ‌య్ జైన్‌కు ఇంకా ఎక్క‌డా పోస్టింగ్ ఇవ్వ‌లేదు. అదే విధంగా చంద్ర‌బాబు..లోకేశ్ వ‌ద్ద క్రియా శీల‌కంగా వ్య‌వ‌హ‌రించి న మరో అధికారి విజ‌యానంద్ ను బ‌దిలీ చేసిన ప్ర‌భుత్వం ఆయ‌న స్థానంలో శ్రీధ‌ర్‌ను నియ‌మించింది. విజ‌యానంద్ కు మాత్రం పోస్టింగ్ ఇవ్వ‌లేదు. ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో ప‌ని చేసిన గిరిజా శంక‌ర్‌కు పంచాయితీ రాజ్ శాఖ‌ను అప్ప‌గించారు. ప‌శ్చిమ గోదావ‌రి క‌లెక్ట‌ర్ సుదీర్ఘ కాలం ప‌ని చేసి..ప్ర‌స్తుతం విశాఖ క‌లెక్ట‌ర్‌గా ఉన్న కాటంనేని భాస్క‌ర్ గ‌త ప్ర‌భుత్వంలోని కొంద‌రు పెద్ద‌ల‌తో స‌త్సంబంధాలు ఉన్నాయి. ఆయ‌న‌ను బ‌దిలీ చేసి శాప్ ఎండీగా నియ‌మించారు. సుదీర్ఘ కాలం వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా ఉన్న పూనం మాల‌కొండ‌య్య‌ను వ్య‌వ‌సాయ శాఖ బాధ్య‌త‌లు కేటాయించారు.

ఆయ‌న మాట చెల్లుబాటు కాలేదా..

ఆయ‌న మాట చెల్లుబాటు కాలేదా..

ఆయ‌న ప్ర‌స్తుత ఏపీ అధికార పార్టీలో దాదాపు రెండో స్థానంలో ఉన్నారు. కొంత మంది అధికారుల పోస్టింగ్‌ల విష‌యం లో ఆయ‌న కొంత మందికి హామీ ఇచ్చిన‌ట్లు సమాచారం. అయితే, ఆయ‌న చెప్పిన విధంగా జ‌గ‌న్ త‌న నిర్ణ‌యం మార్చు కోకుండా త‌న‌కున్న స‌మాచారం..ల‌క్ష్యాల మేర‌కే నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఇందులో పూర్తిగా సీనియ‌ర్ ఐఏయ‌స్ అధికారుల నుండి ప్ర‌తీ ఒక్క‌రి నుండి తీసుకున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా అధికారుల నియామ‌కం పైన సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు. అజ‌య్ క‌ళ్లాం..శామ్యూల్‌..సూచ‌న‌ల మేర‌కు నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+