గెలిచారు..ఇంకా సీఎం కాలేదు : అధికారులతో సమీక్షలు..? : ఆపధ్దర్మ సీఎం ఏం చేస్తున్నారు..!
Recommended Video
ఏపీ ఎన్నికల్లో వైసీపీ సంచలన విషయం సాధించింది. గతంలో ఎన్నడూ లేనంత మెజార్టీ సాధించి చరిత్ర తిరగ రాసింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ, సాంకేతికంగా కాలేదు. ఈ నెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసే వరకూ జగన్ అధికారిక ముఖ్యమంత్రి కాదు. అప్పటి వరకూ ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబే. కానీ, జగన్ ఫలితాలు వచ్చిన నాటి నుండే అధికారిక సమీక్షలు చేస్తున్నారు. అంశాల వారీగా ఆరా తీస్తున్నారు. అధికారులత ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. మరి..ఇలా చేయవచ్చా.. వివాదానికి దారి తీస్తుందా...
అప్పుడే సమీక్షలు ప్రారంభం..
ఎన్నికల్లో గెలిచిన వైసీపీ అధినేత జగన్ ఈనెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అప్పటి వరకూ ఆయన ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నారు..కానీ, ముఖ్యమంత్రి అవ్వలేదు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాతనే ఆయనకు ముఖ్యమంత్రి హోదా వస్తుంది. అయితే, ఎన్నికల ఫలితాలు వెల్లడయిన వెంటనే సీఎస్ మొదలు అధికారులు జగన్ వద్దకు వచ్చారు. జగన్ సైతం వారితో రాష్ట్రంలోని పాలనా పరిస్థితుల గురించి ఆరా తీసారు.

రాష్ట్ర ఆర్దిక పరిస్థితి గురించి అధికారులు వివరించారు. రాష్ట్రంలో 20 వేల కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సినవి పెండింగ్‌లో ఉన్నాయన జగన్ దృష్టికి తీసుకొచ్చారు. అదే సమయంలో రాష్ట్రంలో పాలనా పరంగా తీసుకోబోయే నిర్ణయాల గురించి జగన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించారు. సీఎస్‌గా ఎల్వీనే కొనసాగిస్తున్నట్లుగా స్పష్టమైన హామీ ఇచ్చారు. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా అజయ్ కళ్లాం నియామకం ప్రకటించారు.
ఆపద్ధర్మ సీఎం ఉండగానే...
ఇక, ఈ రోజు ఐఏయస్ అధికారులతో జగన్ ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. వారి సమస్యలను..అభిప్రాయాలను తెలుసుకోవటంతో పాటుగా తన లక్ష్యాలను వివరించనున్నారు. ఆర్దిక-ఇరిగేషన్-శాంతి భద్రతల పైన అధికారులతో సమీక్షలు చేయనున్నారు. ముందుగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో వీటి పైన చర్చించారు. అధికారులు అందరూ జగన్ వద్దకు వస్తుండటం..సమీక్ష చేయనుండటంతో ఇప్పుడు అసలు జగన్‌కు అప్పుడే ఆ అధికారం ఉంటుందా అనే చర్చ మొదలైంది. మరో వైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాజీనామా చేసినా..జగన్ ప్రమాణ స్వీకారం చేసే వరకూ ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.


ఈ గ్యాప్‌లో జగన్ ముఖ్యమంత్రి చేయాల్సిన సమీక్షలు చేసేస్తున్నారు. దీని పైన చర్చ జరుగుతున్న వేళ.. వైసీపీ నేతలు ఈ వాదనతో విభేదిస్తున్నారు. జగన్‌తో అధికారులు కేవలం మర్యాద పూర్వకంగా కలవటానికి వచ్చిన సమయంలో వాకబు చేస్తున్న అంశాలే కానీ..వీటిని అధికారిక సమీక్షలుగా చూడలేమని చెప్పుకొస్తున్నారు. అయితే, ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్‌కు తిరుమల-తిరుపతి దేవస్థానం అర్చకులు ఉండవల్లికి వచ్చి జగన్‌కు ఆశీర్వాదం ఇచ్చారు. సీఎంగా బాధ్యతలు చేపట్టకముందే ముఖ్యమంత్రిగా అధికారాలు వచ్చేసాయి. భద్రత..కొత్త కాన్వాయ్ కేటాయించారు.












Click it and Unblock the Notifications