వైఎస్సార్ ఘాట్ కు జగన్: రెండోరోజు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన సాగుతుందిలా!!
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లా అయిన కడప జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కడప జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్ లో బస చేశారు. సీఎం జగన్ కడప మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇక ఈరోజు రెండవ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన షెడ్యూల్ ఈ విధంగా ఉండనుంది.
ఈరోజు ఉదయం 8 గంటలకు ఇడుపులపాయ గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి వైయస్సార్ ఘాటుకు చేరుకుని అనంతరం ఆయన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి నివాళులు అర్పించనున్నారు . ఆ తర్వాత ఇడుపులపాయ ప్రేయర్ హాల్లో జరిగే ప్రార్ధనలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. సుమారు 3 గంటలపాటు సీఎం ప్రార్థనల్లో పాల్గొనబోతున్నారు.

ఇక మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం చేరుకోనున్న సీఎం జగన్ అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు.అక్కడ మండలం ఎమ్మార్వో ఆఫీస్, పోలీస్ స్టేషన్, రోడ్డు వైడనింగ్ వంటి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలలో సీఎం జగన్ పాల్గొంటారు. తిరిగి సాయంత్రం మూడు గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారు.
ఇడుపులపాయలోని ఎకో పార్కులో పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశమవుతారు. గంటన్నర పాటు వారితో ఈ భేటీ జరగనుంది. ఆ తర్వాత ఈ రాత్రికి ఇడుపులపాయ గెస్ట్ హౌస్ లోనే సీఎం జగన్ బస చేయనున్నారు.రేపు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జగన్ రేపు ఉదయం ఇడుపులపాయ గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు.
అక్కడ సీఎస్ఐ చర్చిలో సీఎం జగన్ క్రిస్మస్ వేడుకలలో పాల్గొంటారు. అక్కడి వారితో కలిసి క్రిస్మస్ ప్రార్థనలు చేస్తారు. తర్వాత తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రతీ సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా కడప లోని సిఎస్ఐ చర్చిలో ప్రార్ధనలలో ఆయన పాల్గొనటం చాలా కాలంగా వస్తున్న ఆనవాయితీ.












Click it and Unblock the Notifications