జగనన్న ఆరోగ్య సురక్ష 2.0: డిసెంబర్ 1 నుంచి ఇంటింటికీ ఆరోగ్య శ్రీ ప్రచారం..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కూడా ఒకటి. సీఎం జగన్ తండ్రి వైఎస్సార్ మానసపుత్రిక అయిన ఆరోగ్యశ్రీ పథకాన్ని పలు మార్పులు చేసి విజయవంతంగా అమలు చేస్తున్న నేపథ్యంలో దీన్ని మరింతగా లబ్దిదారుల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఆరోగ్య శ్రీ పథకంపై ఇంటింటి ప్రచారం చేపట్టాలని వైసీపీ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు ఇస్తోంది.
డిసెంబర్ 1నుండి ఏఎన్ ఎంలు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య శ్రీ పథకం పై అవగాహన కల్పించాలని ఆరోగ్యశ్రీ సిఇఓ డాక్టర్ వెంకటేశ్వర్ ఇవాళ ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలమేరకు జనవరి 1నుండి జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1 నుండి ఎఎన్ ఎంలు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్యశ్రీ బ్రోచర్లను అందజేయాలని ఆదేశాలు ఇచ్చారు.

ఇవాళ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయ అధికారులతో సీఈవో వెంకటేశ్వరి ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణా కార్యక్రమంలో 26 జిల్లాల ఎఎన్ఎంలు పాల్గొన్నారు. ఇందులో
ఆరోగ్యశ్రీ బ్రోచర్ లోని ప్రతి విషయాన్నీ ప్రజలకు వివరించాలని వారికి సూచించారు. ఆరోగ్యశ్రీ పథకం యొక్క లక్ష్యాల్ని , ప్రయోజనాల్ని తెలియజేయాలన్నారు.
అలాగే ఆరోగ్యశ్రీ యాప్ ను ప్రతి కుటంబంలో కనీసం ఒక్కరి ఫోన్ లో ఐనా ఇన్ స్టాల్ చేయించాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ యాప్ లో ఉన్న ప్రతి ఆప్షన్ నూ లబ్దిదారులకు వివరించాలని ఆరోగ్య శ్రీ సిఇవో డాక్టర్ వెంకటేశ్వర్ ఏఎన్ఎంలకు సూచించారు. దీంతో వారు ఈ కార్యక్రమం చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications