ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త
రాష్ట్ర ప్రజలకు వైసీపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వచ్చే నెల ఒకటోతేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల దగ్గర జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయబోతోంది. 11 రకాల సేవలతోపాటు ధ్రువీకరణ పత్రాల జారీకి ఎటువంటి సర్వీస్ ఛార్జి వసూలు చేయరు. ఈనెల 24వ తేదీ నుంచే వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఈ కార్యక్రమం గురించి వివరిస్తారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాల జారీకి కూడా వినతిపత్రాలు తీసుకోనున్నారు.
ఈ ప్రత్యేక క్యాంపుల నిర్వహణ కోసం ఎంపీడీవో, తహసీల్దార్‌ల ఆధ్వర్యంలో మండలాల వారీగా రెండు వేర్వేరు టీమ్‌లను ఏర్పాటు చేయబోతున్నారు. వీటిల్లో మండల స్థాయి అధికారులు ముగ్గురు ఉంటారు. అవసరమైతే మూడో టీమ్ ను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ క్యాంపుల పర్యవేక్షణకు జిల్లా కలెక్టర్లు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అధికారులను నియమిస్తారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేవారికి ముందుగానే శిక్షణ ఇవ్వబోతున్నారు. సచివాలయాల దగ్గర నిర్వహించే క్యాంపుల్లో 11 సర్వీసులకు ఎటువంటి ఛార్జీలుండవు. మ్యుటేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్‌కు సంబంధించి పాస్ పుస్తకాల జారీకి దరఖాస్తుదారులు చెల్లించాల్సిన స్టాట్యుటరీ చార్జీలను మాత్రం వసూలు చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
1) ఆదాయ ధ్రువీకరణ పత్రం
2) డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్
3) ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు (కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు)
4) మరణ ధ్రువీకరణ పత్రం
5) మ్యుటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్
6) కొత్త రేషన్‌కార్డు లేదా రేషన్‌కార్డు విభజన
7) ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు
8) ఆధార్‌కార్డులో మొబైల్ నంబర్ అప్‌డేట్
9) కౌలు గుర్తింపు కార్డులు (సీసీఆర్‌సీ)
10) వివాహ ధ్రువీకరణ పత్రం (పట్టణ ప్రాంతాల్లో అయితే 90 రోజుల్లోగా, గ్రామీణ ప్రాంతాల్లో 60 రోజుల్లోపు)
11) ప్రభుత్వ డేటాకు సంబంధించి కుటుంబ వివరాల్లో కొంత మంది సభ్యుల పేర్ల తొలగింపు.












Click it and Unblock the Notifications