వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సభలో అలా చేయలేదే: జగ్గారెడ్డి, కెసిఆర్‌పై రాములమ్మ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jagga Reddy and Vijay Shanthi questioned KCR
హైదరాబాద్: నిజాం కళాశాల మైదానంలో జరిగిన సకల జన భేరీ సభలో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకులను పిలిచి సన్మానం చేయాలి కానీ అలా చేయలేదని అలాగే తెలంగాణ ఇచ్చిన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పాల్సి ఉన్నా చెప్పలేదని ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి సోమవారం అన్నారు.

విభజన వాదం వినిపిస్తున్న పార్టీలు అన్ని తెలంగాణ ఇచ్చిన సోనియాను, కాంగ్రెసు పార్టీని మర్చిపోవడం దారుణమన్నారు. విభజన కోరుకుంటున్న పార్టీలు ఉమ్మడి సభ పెట్టి సోనియాకు కృతజ్ఞతలు చెప్పాలన్నారు. సీమాంధ్రలో తమ పార్టీ మునిగిపోతున్నా తెలంగాణ ఇస్తామని చెబుతుంటే ఇంకా అనుమానాలు ఎలా అని ప్రశ్నించారు.

కాంగ్రెసు పార్టీని దెబ్బతీసేందుకే నిన్నటి సకల జన భేరీ సభ అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని ధిక్కరించడం లేదని, అప్పీల్ చేస్తున్నారని చెప్పారు. కెసిఆర్‌కు కావాల్సింది విభజననా లేక రాజకీయమా చెప్పాలన్నారు. తెలంగాణపై వెనక్కి పోవాలంటున్న బిజెపిని పొగడటమేమిటని ప్రశ్నించారు.

కెసిఆర్‌పై రాములమ్మ

సకల జన భేరీ సభలో కెసిఆర్ తెలంగాణ ఇస్తామన్న కాంగ్రెసు పార్టీకి కనీస కృతజ్ఞత కూడా చెప్పలేదని మెదక్ ఎంపి విజయశాంతి ఆదివారం విమర్శఇంచారు. తెలంగాణ ఇస్తామన్న కాంగ్రెసును వదిలి బిజెపి నేతలను పొగడటమేమిటన్నారు. ఢిల్లీ స్థాయిలో కాంగ్రెసు నేతలు తెరాసను కొంత పట్టించుకోనందువల్లనే బిజెపి వైపు వెళ్లే దిశగా కెసిఆర్ అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. కాంగ్రెసుతో అవగాహన కుదరక పోవడంతో వచ్చే ఎన్నికల్లో బిజెపితో కలిసేందుకు ఆలోచిస్తున్నట్లు అతని ప్రసంగం సంకేతాలిస్తోందన్నారు. ఎన్నికల ముందు తెలంగాణ రావడం కెసిఆర్‌కు ఇష్టం లేనట్లుగా కనిపిస్తోందన్నారు.

English summary
Sangareddy MLA Jagga Reddy and Medak MP Vijayasanthi questioned TRS chief K Chandrasekhar Rao why he was praised BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X