కెసిఆర్‌కు జగ్గారెడ్డి అభినందనలు: వమ్ము చేయొద్దని..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అధికార పీఠం ఎక్కించిన తెలంగాణ ప్రజల ఆశలను కెసిఆర్ నెరవేర్చాలని ఆయన అన్నారు.
తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ప్రజల ఆశలను కెసిఆర్ వమ్ము చేయకూడదని అన్నారు.

ఇది ఇలా ఉండగా జిల్లాల అధికారులు, క్షత్రస్థాయి అధికారులతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. రైతులకు సబ్సిడీపై స్ప్రింకర్లను పంపిణీ చేస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం సబ్సిడీపై స్ప్రింకర్లను అందజేస్తామని పోచారం శ్రీనివాస్ చెప్పారు.
ఆధునిక సాంకేతిక పరికరాలపై రైతులకు అవగాహన కల్పిస్తామని ఆయన చెప్పారు. తొలిదశలో 44వేల హెక్టార్లలో హర్టీకల్చర్‌పై దృష్టిసారించినట్లు ఆయన తెలిపారు. జిల్లాలవారీగా టార్గెట్ పెట్టుకుంటున్నట్లు చెప్పారు. శనివారం నుంచి సోయాబీన్ విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సహకార సంస్థల ద్వారా ఎరువులు, విత్తనాలను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications