బెయిల్‌పై వచ్చి అనుమానంతో భార్యను చంపిన భర్త

వైవాహికేతర సంబంధం ఉందనే అనుమానంతో మొహమ్మద్ అబ్రార్ అహ్మద్ అనే వ్యక్తి తన భార్య షఙీన్ బేగంను హత్య చేశాడు. గురువారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో అలీనగర్‌లోని తన ఇంటికి వచ్చిన అతను తొలుత భార్య గొంతుపై నరికాడు. డాగర్‌తో దేహంపై, తలపై గాయాలు చేశాడు.
ఇద్దరు టీనేజ్ పిల్లలు ఇంట్లో ఉండగానే అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. దాడి చేస్తున్న సందర్భంలో తన మరదలిని కూడా గాయపరిచాడు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. అహ్మద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
బీహార్‌కు చెందిన అహ్మద్ దుబాయ్‌లో సుతారిగా పనిచేసేవాడు. ఐదేళ్ల తర్వాత కుటుంబ సభ్యులకు తెలియకుండా జూన్‌లో నగరానికి వచ్చాడు. భార్య వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో నిరుడు జూన్ 27వ తేదీన గొడవ పడ్డాడు. ఈ గొడవలో అతను బేగం తల్లిని, సోదరుడిని హత్య చేశాడు. స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
కత్తితో స్థానికులను బెదిరించి అతను భార్యను హత్య చేసిన తర్వాత పారిపోయాడని పోలీసులు అంటున్నారు. అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications