హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంతకుమించి చేస్తే, చెప్పలేం: హైదరాబాద్‌పై జైపాల్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jaipal Reddy
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు రెవెన్యూ పరిధి వరకే ఉమ్మడి రాజధానిని అంగీకరిస్తామని అంతకుమించి చేస్తే తమ నిరసన తెలియజేస్తామని కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి సోమవారం అన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ఉదయం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు.

భేటీ అనంతరం జైపాల్ రెడ్డి మాట్లాడుతూ... హైదరాబాదు రెవెన్యూ పరిధి వరకే ఉమ్మడి రాజధాని చేయాలన్నారు. అంతకుముంచి చేస్తే అంగీకరించేది లేదని, నిరసన తెలియజేస్తామన్నారు. విభజన బిల్లు వివరాలు తమ వద్ద లేనప్పుడు ఎక్కువగా స్పందించలేమని చెప్పారు.

నదీజలాలు, భద్రాచలంపై కచ్చితమైన అభిప్రాయాలు తమకు ఉన్నాయని చెప్పారు. భద్రాచలం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతంలోనే ఉంటుందని చెప్పారు. పదేళ్ల ఉమ్మడి రాజధాని పేరుతో అధిక భారం వేస్తే తాము ఒప్పుకోమని జైపాల్ రెడ్డి తేల్చి చెప్పారు. అప్పులు, ఆస్తులను కూడా అలాగే పంపిణీ చేయాలన్నారు.

పోలవరం కోసం భద్రాచలం రెవెన్యూ డివిజన్‌ను అడుగుతున్న వారు ఛత్తీస్‌గఢ్, ఒడిశా ముంపు ప్రాంతాలను కూడా అడుగుతారా చెప్పాలన్నారు. రెండు రాష్ట్రాల్లో 371 డిని ఉంచాలని కోరుతామన్నారు. కాగా ఈ నెల 14లోగా ఢిల్లీ వెళ్లాలని తెలంగాణ కాంగ్రెసు నేతలు నిర్ణయించారు. హైదరాబాదు అంశం బాధ్యతను ఉప ముఖ్యమంత్రి దామోదరకు అప్పగించారు.

జైరాం రమేష్‌తో జలవనరుల శాఖ అధికారుల భేటీ

కేంద్రమంత్రి జైరాం రమేష్‌తో కేంద్ర జలవనరుల శాఖ అధికారులు సమావేశమయ్యారు. సుమారు రెండు గంటల పాటు జలవనరుల పంపిణీ, నిర్వహణ వినియోగంపై జివోఎం చర్చించింది. నీటి పంపిణీలు, నిర్వహణపై జివోఎంకు అలోక్ రావత్ నేతృత్వంలోని అధికారులు వివరాలు అందించారు.

English summary
Union Minister Jaiapl Reddy on Monday said they will not accept GHMC as joint capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X