వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎం పదవి కోసమే: జైపాల్‌పై దేవినేని, కిరణ్‌పై రాజేంద్ర

By Srinivas
|
Google Oneindia TeluguNews

Devineni Umamaheswara Rao
హైదరాబాద్/విజయవాడ: కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం విభజనలో శకుని పాత్ర పోషిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు మంగళవారం ఆరోపించారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రీశైలం, నాగార్జుల సాగర్ ప్రాజెక్టులు సీమాంధ్రలోనివే అని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు సర్వే నెంబర్లు కర్నూలు జిల్లా పరిధిలో ఉన్నాయని, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సర్వే నెంబర్లు గుంటూరు జిల్లాలో ఉన్నాయని వివరించారు.

ఈ మేరకు ప్రభుత్వానికి అటవీ శాఖ సమర్పించిన నివేదికలో ఈ అంశాలు ఉన్నాయని వెల్లడించారు. శ్రీశైలం ఎడమ, కుడి కాలువలు సీమాంధ్రకే ఉండాలన్నారు. భద్రాచలం, అశ్వారావుపేట, సత్తుపల్లిల సర్వే నెంబర్లు బహిర్గతం చేయాలన్నారు. ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటమే అన్ని సమస్యలకు పరిష్కారమన్నారు.

కిరణ్ శల్య సారథ్యం: రాజేంద్ర ప్రసాద్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర కోసం శల్య సారథ్యం చేస్తున్నారని టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ధ్వజమెత్తారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ డైరెక్షన్లో కిరణ్ ముందుకు సాగుతున్నారన్నారు. ఎపిఎన్జీవోల ఉద్యమానికి కిరణ్ వెన్నుపోటు పొడిచారన్నారు. రచ్చబండలో రచ్చ చేసే బదులు సోనియా ఇంటి ముందు చేయాలన్నారు.

కాగా, ముఖ్యమంత్రికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసన మండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు మంగళవారం లేఖ రాసిన విషయం తెలిసిందే. మంత్రుల బృందం (జివోఎం)కు ఇచ్చిన రెండు పుస్తకాల నివేదికను బహిరంగ పర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన నివేదిక పబ్లిక్ డాక్యుమెంటే అన్నారు.

English summary
Telugudesam party senior leader Devineni Umamaheswara Rao on Tuesday alleged Jaipal Reddy is lobbying for Telangana state for CM post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X