సోనియాకు థ్యాంక్స్ చెప్పరా?: జానా, అడిగా: కేసీఆర్
హైదరాబాద్: ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత జానా రెడ్డి శుక్రవారం అన్నారు. శాసన సభలో బడ్జెట్ పైన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.
తెలంగాణ ప్రజల బలీయమైన ఆకాంక్ష, సుదీర్ఘ పోరాటం ఫలితంగా తెలంగాణ వచ్చిందని, ఎన్నో ఆటంకాలను ఎదురొడ్డి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని జానారెడ్డి అన్నారు. ఎన్ని ఆటంకాలు వచ్చిన కాంగ్రెస్ తెలంగాణకు కట్టుబడి ఇచ్చిందన్నారు. తొలుత నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

వివరణ ఇవ్వాలి: లక్ష్మణ్
బేషజాలకు పోవద్దని తాము మొదటి నుండి చెబుతున్నామని, చర్చకు తాము సిద్ధమని బీజేపీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. అయితే, రైతుల ఆత్మహత్య పైన బాధ్యాతాయుత మంత్రి చులకనగా మాట్లాడారని, దాని పైన వివరణ ఇప్పించాలని చెప్పారు.
పనిగట్టుకొని వార్తలు రాస్తున్నారు: కేసీఆర్
వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాధ్యతాయుతమైన వ్యక్తి అన్నారు. ఆయన పలుమార్లు మంత్రిగా పని చేశారన్నారు. పత్రికల్లో వచ్చిన వార్తల పైన తాను ఉదయమే ఆయనను ప్రశ్నించానని, దానికి పోచారం.. తాను అలా మాట్లాడలేదని చెప్పారని తెలిపారు. గతంలోను ఇలా పలుమార్లు జరిగిందన్నారు. కొంతమంది పనిగట్టుకొని వార్తలు రాసిన సందర్భాలు ఉన్నాయన్నారు.
టీడీపీ పక్కా ప్రణాళికతో సభను జరగనివ్వడం లేదన్నారు. కరెంట్ విషయంలో టీడీపీ బండారం బయటపడుతుందనే వారు అడ్డుకునే ప్రయత్నాలు చేశారన్నారు. పోచారం రైతు బిడ్డ అన్నారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుండి రైతు, విద్యుత్ సమస్యల పైన చర్చించుదామని చెప్పారు. కాగా, అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications