ఓటమిపై జానా, కేసీఆర్ పైనా: రాజధానిపై హరిబాబు

పాలమూరుకు ప్రాధాన్యత: కేటీఆర్
వెనుకబడిన పాలమూరుకు తాము అండగా ఉంటామని ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పారు. కేబినెట్ విస్తరణలో పాలమూరుకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. కేటీఆర్ మహబూబ్ నగర్‌లో రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో పాలమూరు జిల్లాకు అనుబంధం ఉందన్నారు. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణను అభివృద్ధి చేస్తామన్నారు. జడ్చర్ల - మహబూబ్ నగర్ రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేస్తామన్నారు.
రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకారం: హరిబాబు
నూతనంగా నిర్మాణం జరిగే రాజధాని అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు గుంటూరు జిల్లాలో అన్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజధాని అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ జరగాలన్నారు. కేంద్రీకృత వ్యవస్థ పద్ధతిలో అభివృద్ధి మంచిది కాదని అభిప్రాయపడ్డారు.
వివిధ ప్రభుత్వ కీలక శాఖలు ఆయా ప్రాంతాలలో నెలకొల్పి అక్కడ నుండే పని చేయాలన్నారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అవసరమన్నారు. 25 పార్లమెంటు స్థానాలున్న ఎపిలో 25 జిల్లాలు ఉండేలా ప్రభుత్వం ఆలోచించాలన్నారు. బీజేపీ చేస్తున్న ఈ ప్రతిపాదనకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక తయారు చసి కేంద్రం నుంచి అవసరమైన సాయం పొందాలన్నారు.












Click it and Unblock the Notifications