ఆశ్చర్యపోయా: కేసీఆర్, మార్చుకో: జానారెడ్డి, బాబుకూ
హైదరాబాద్: విద్యుత్ విషయంలో గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల హయాంలో... సభనే ఆశ్చర్యపోయే నిజాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శాసన సభలో సోమవారం అన్నారు. తెలంగాణ రైతులు పంటలు ఎండగొట్టాలని చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కరెంట్ కోతలకు, ఆత్మహత్యలకు కాంగ్రెస్, టీడీపీలే కారణమన్నారు. రాష్ట్రానికి కరెంట్ రావాలన్న చిత్తశుద్ది కాంగ్రెస్ పార్టీకి లేదా అని ప్రశ్నించారు.
తాము వాస్తవాలు చెబుతుంటే విపక్షాలు ఎందుకు వినడం లేదన్నారు. విపక్షాలు నానా యాగీ చేయడం సరికాదన్నారు. మొత్తం విషయాలు బయటకు రావాల్సిందే అన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు. తమ యాత్రల బండారం బయటపడుతుందనే కుంటిసాకులు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పొరుగు రాష్ట్రం మనల్ని మోసం చేస్తోందని, తెలుగుదేశం పార్టీ చరిత్ర అంతా బయటకు రావాల్సిందే అన్నారు.
పొరుగు రాష్ట్రం మోసం చేస్తుంటే ముక్కుపిండి విద్యుత్ తెచ్చుకోవద్దా అని సభ్యులను ప్రశ్నించారు. టీడీపీ నేతలు బయట యాత్రలు చేస్తూ ఇక్కడ డ్రామాలు ఆడుతారా అని ప్రశ్నించారు. చర్చకు తాము నలబై, యాభై రోజులైనా సిద్ధమన్నారు. విపక్షాల రాద్ధాంతం ప్రజలకు తెలియాలన్నారు. రైతుల పైన కాంగ్రెస్, టీడీపీలు ముసలి కన్నీరు కారుస్తున్నాయన్నారు. విపక్షాలకు తాము వంద క్లారిఫికేషన్స్ ఇచ్చేందుకైనా సిద్ధమన్నారు.

మనకు అనేక విద్యుత్ కష్టాలు ఉన్నాయన్నారు. చీకట్లో చిరుదీపంలో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు మనకు ఉన్నాయన్నారు. వాస్తవాలన్నీ ప్రజలు వింటున్నారన్నారు. వాస్తవాలు చెబుతుంటే ప్రజలు తట్టుకోలేకపోతున్నాయన్నారు. తుఫాన్ దెబ్బకి సింహాద్రి విద్యుత్ యూనిట్ ఆగిపోయిందని, నార్త్ సౌత్ గ్రిడ్ కనెక్టివీటి మనకు లేదని కేసీఆర్ చెప్పారు. రాయచూర్ నుండి సోలాపూర్‌కు వేసిన స్లాట్‌లలో విద్యుత్ కొందామన్న నాటి సిఎం కిరణ్ పట్టించుకోలేదన్నారు.
శ్రీశైలంలో చంద్రబాబు నుండి కిరణ్ వరకు.. 762 అడుగుల వరకు ఉన్నా విద్యుత్ ఉత్పత్తి చేశారన్నారు. తెలంగాణ పైన చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు కృష్ణా ట్రిబ్యునల్‌ను ఆగమేఘాల మీద పిలిపించి విద్యుత్ ఆపు చేయించారన్నారు. మనం పరస్పరం విమర్శలు మాని, రాజకీయాలకు అతీతంగా రైతుల కోసం పాటుపడదామని చెప్పారు. విద్యుత్ కొరత నివారించేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
సోలార్ పవర్‌కు టెండర్లు పిలిచామన్నారు. త్వరలో ఎన్టీపీసీ నుండి నాలుగువేల మెగావాట్ల విద్యుత్ వస్తుందన్నారు. చత్తీసగఢ్ నుండి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కోసం ఒప్పందం కుదిరిందన్నారు. బాబు ఫీజులు పీకుతుంటే టీడీపీ నేతలు యాత్రలు చేస్తున్నారన్నారు. విద్యుత్ కష్టాలకు ఇన్నేళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీయా లేక 5 నెలలే అవుతున్న తమ పాలన కారణమా అని ప్రశ్నించారు. రానున్న మూడేళ్లలో 21 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.
ఈ పద్ధతి మానుకోవాలి: జానా రెడ్డి
విద్యుత్ కష్టాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని పదేపదే కేసీఆర్ చెప్పడం సరికాదని, ఈ పద్ధతి మానుకోవాలని కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత జానా రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి గుడిసెకు విద్యుత్ ఇచ్చిందన్నారు. తెలంగాణ ఇచ్చిన తమనే తప్పు పట్టడం ఏమిటన్నారు. చంద్రబాబు ఒప్పందంలో ఉన్న దానికి విరుద్ధంగా వెళ్తున్నారని జానా అన్నారు. ఏపీ ప్రభుత్వం విభజన చట్టం ప్రకారం నడుచుకోక పోవడం వల్ల విద్యుత్ కష్టాలు వచ్చాయన్నారు. తెలంగాణకు 54 శాతం ఇవ్వాల్సిందే అన్నారు. విద్యుత్ పైన ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. దీనిపై కేసీఆర్ మాట్లాడుతూ.. జానా సూచనలు తాము పాటిస్తామన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications