కేశినేని వ్యాఖ్యపై జనసేన భగ్గు, టీడీపీకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సవాల్
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలకు జనసేన, పవన్ అభిమానులు మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ మద్దతు లేకుంటే టీడీపీకి అధికారం దక్కేదా అని జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
టీడీపీ నేతలు, ముఖ్యంగా కేశినేని నాని వ్యాఖ్యల పైన జనసేన పార్టీ కార్యకర్తలు విజయవాడలోని కాళేశ్వర మార్కెట్ సెంటరులో నిరసనకు దిగారు. కేశినేని నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పవన్ ప్రచారం చేయకుంటే టీడీపీ ఎక్కడ అన్నారు. దానిని మరిచి పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేస్తారా అన్నారు.

తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఇప్పటి వరకు ప్రత్యేక హోదా తీసుకు రాలేదని, దానిని ప్రశ్నిస్తే తమ పార్టీ అధినేత పైన విమర్సలు గుప్పిస్తారా అన్నారు. దమ్ముంటే వచ్చే పార్లమెంటు సమావేశాల్లో కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా తీసుకు రావాలని సవాల్ చేశారు.












Click it and Unblock the Notifications