45 ఏళ్ల బీజేపీ ప్రస్థానం.. పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్

'అంధకారం అస్తమిస్తుంది. సూర్యుడు ఉదయిస్తాడు. కమలం వికసిస్తుంది'.. సరిగ్గా 45 ఏళ్ల క్రితం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున అటల్ బిహారి వాజ్ పేయి ప్రసంగంలో మాటలు ఇవి. 1980, ఏప్రిల్ 6న శ్యాంప్రసాద్ ముఖర్జీ, దిందయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారి వాజ్‌ పేయి, ఎల్కే అద్వాని ఆధ్వర్యంలో బీజేపీ అవతరించింది. అప్పుడు ఇద్దరు ఎంపీలతో మొదలైన బీజేపీ.. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది.

ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. భారతీయ జనతా పార్టీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నేతలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. " భారతీయ జనతా పార్టీ 46వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.

Jana Sena Chief Pawan Kalyan Greets BJP on Foundation Day

చారిత్రాత్మక ఉద్యమం ద్వారా బీజేపీ పార్టీ పుట్టింది. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి, ఎల్కే అద్వానీ లాంటి నేతలు ప్రజాస్వామ్య భారత్ కోసం పార్టీ స్థాపనకు కృషి చేశారు. దేశానికి సేవ చేయాలని ఆ మహనీయులు స్థాపించిన పార్టీ.. ఇప్పుడు కోట్ల మంది ఆశయాలను నెరవేరుస్తోంది.

ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల కృషి వల్ల ప్రపంచంలోనే బీజేపీ అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. దేశంలో మూడు పర్యాయాలుగా ప్రజలకు సేవలు అందిస్తోంది. ఈ చరిత్రాత్మక సందర్భంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలు, నాయకులకు శుభాకాంక్షలు చెబుతున్నా" అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Take a Poll

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+