సముద్రస్నానం చేసిన పవన్ కళ్యాణ్, నేడే పోరాట యాత్ర ప్రారంభం
శ్రీకాకుళం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇఛ్ఛాపురం నుంచి ప్రారంభం కానుంది. కపాసుకుద్ది తీర ప్రాంతంలో గంగపూజ చేశారు. ఉదయం గం.11.30కు స్వేచ్ఛావతి అమ్మవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇచ్ఛాపురంలో నిరసన కవాతులో పాల్గొంటారు.
పవన్ కళ్యాణ్ మత్స్యకారులతో కలిసి సముద్రస్నానం చేశారు. అనంతరం తీర ప్రాంతంలో గంగపూజ నిర్వహించారు. పవన్ కళ్యాణ్ రాక నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. ఆయనను చూసేందుకు చాలామంది ఆసక్తి చూపించారు.

కాగా, పవన్ తలపెట్టిన జన పోరాట యాత్ర ఈ రోజు ప్రారంభం కానుంది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం నుంచి మొదలయ్యే ఈ యాత్ర 45 రోజుల పాటు కొనసాగుతుంది. ఆదివారం మధ్యాహ్నం సూరంగి రాజావారి మైదానంలో బహిరంగ సభ నిర్వహించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు.












Click it and Unblock the Notifications