
జగన్‌ను టార్గెట్ చేయడానికి చిరంజీవిని వాడుకుంటోన్న పవన్ కల్యాణ్..?
అమరావతి: మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను జరుపుకొంటోన్న వేళ.. ఆయన సోదరుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సరికొత్త వివాదానికి తెర తీసినట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చిరంజీవికి ఉన్న సన్నిహిత సంబంధాలను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తోన్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. చిరంజీవిని, ఆయనకు ఉన్న ఛరిష్మాను జనసేనకు మాత్రమే పరిమితం చేసేలా పవన్ కల్యాణ్ కొత్త రాజకీయ వ్యూహాన్ని ఎంచుకున్నారని అంటున్నారు.
బీజేపీలో
చేరండి..
సీబీఐ-ఈడీ
దాడుల
నుంచి
తప్పించుకోండి..!!

ఇప్పుడు ప్రస్తావన..
సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఈ ఏడాది మార్చిలో చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, ఎస్ఎస్ రాజమౌలి, ఆర్ నారాయణ మూర్తి, అలీ, పోసాని కృష్ణమూర్తి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో చిరంజీవి.. వైఎస్ జగన్‌ను నమస్కరించిన అంశాన్ని పవన్ కల్యాణ్ ఇప్పుడు తెర మీదికి తీసుకుని రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండు రోజుల కిందటే కడప జిల్లా సిద్ధవటంలో నిర్వహించిన రచ్చబండలో తొలిసారిగా దీన్ని లేవనెత్తారాయన.

కుసంస్కారిగా..
ఇప్పుడు మళ్లీ అదే అంశాన్ని ప్రస్తావించారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా దాన్ని గుర్తు చేశారు. తాను కలవబోయే వ్యక్తి ప్రతి నమస్కారం కూడా చేయలేని కుసంస్కారి అయినప్పటికీ.. తను చేతులెత్తి నమస్కరించే సంస్కారం చిరంజీవి సొంతం.. అంటూ పవన్ కల్యాణ్ చెప్పారు. వైఎస్ జగన్ కుసంస్కారి అంటూ పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు. వయసు తారతమ్యాలు.. వైర్గ వైరుధ్యాలు..కులమతాలకు అతీతంగా అందరినీ అక్కు చేర్చుకునే విశాల హృదయుడు చిరంజీవి అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

సన్నిహిత సంబంధాలను దెబ్బతీయడానికా?
వయసులో తనకంటే చిన్నవాడైనప్పటికీ.. చిరంజీవి- వైఎస్ జగన్‌ను చేతులు జోడించి అర్థించాల్సి వచ్చిందనే అభిప్రాయాన్ని పవన్ కల్యాణ్ చెప్పకనే చెప్పినట్టయింది. జగన్‌ను విమర్శించడానికి చిరంజీవి పుట్టినరోజును కూడా పవన్ కల్యాణ్ వాడుకున్నాడనేది ఇక్కడ స్పష్టమైందని అంటున్నారు. జగన్-చిరంజీవి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు, సోదర భావాన్ని తెంచడానికే పవన్ కల్యాణ్.. తాజాగా తన ప్రయత్నాలు మొదలు పెట్టారా? అనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి.

వైసీపీ వాదన ఏంటీ?
జగన్ స్థానంలో ఎవరు ఉన్నా గానీ చిరంజీవి.. నమస్కరించే వాడేనని, దాన్ని తప్పు పట్టడం అర్థం లేదంటూ కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతోన్నారు. అయిదు నెలల కిందట జరిగిన అంశాన్ని ఇప్పుడు తెర మీదికి తీసుకుని రావడం వల్ల చిరంజీవిని కూడా రాజకీయంగా వాడుకుంటున్నాడంటూ పవన్ కల్యాణ్‌పై మండిపడుతున్నారు. దానికే కట్టుబడి ఉంటే సినిమా రంగానికే చెందిన జూనియర్ ఎన్టీఆర్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వద్ద చేతులు కట్టుకోవడం, ఆయనకు నమస్కరించడాన్ని కూడా తప్పు పట్టాల్సి ఉంటుందని అంటున్నారు.