శుభవార్త: జనసేన సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం, పవన్ ప్లాన్ ఇదే

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్:జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పార్టీ సభ్యత్వాన్ని ప్రారంభించారు. తొలి సభ్యత్వాన్ని పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు స్వీకరించారు.త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించనున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు

2019 ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయనున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణను సిద్దం చేసుకొంటున్నారు.

2014 ఎన్నికల సమయంలో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. అయితే ఆ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ టిడిపి, బిజెపి కూటమికి మద్దతిచ్చారు. కానీ 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు.

జనసేన సభ్వత్వాన్ని ప్రారంభించిన పవన్

జనసేన సభ్వత్వాన్ని ప్రారంభించిన పవన్

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు.హైద్రాబాద్ పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ పార్టీ సభ్యత్వాన్ని ప్రారంభించారు.తొలి సభ్యత్వాన్ని పవన్ కళ్యాణ్ తీసుకొన్నారు. పార్టీలోని ముఖ్యులకు కూడ పవన్ కళ్యాణ్ సభ్యత్వాన్ని అందించారు. రెండు రాష్ట్రాల్లో త్వరలోనే సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించనున్నట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు.

జనసేన వైఖరి అర్ధం కాలేదు, కాంగ్రెస్ గెలిస్తే పునర్విభజన చట్టం అమలు: ఉండవల్లి

పార్టీ సిద్దాంతాలను వివరించిన పవన్

పార్టీ సిద్దాంతాలను వివరించిన పవన్

పార్టీ సిద్దాంతాలను పవన్ కళ్యాణ్ వివరించారు. సుమారు 10 ఏళ్ళుగా తన వెన్నంటి ఉన్నవారితో పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయంలో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పార్టీ సిద్దాంతాలను వివరించారు. ఏ కారణాల చేత జనసేన పార్టీని ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ఇతర పార్టీల కంటే జనసేన పార్టీ ఎందుకు భిన్నంగా ఉండాలనే అంశాలను పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు.

సోషల్ మీడియాలో పవన్, జగన్ అభిమానుల తిట్ల యుద్దం, వెంకట్‌రెడ్డి అరెస్ట్, పోలీసుల నిఘా

పార్టీ కార్యకర్తలతో వర్క్‌షాప్

పార్టీ కార్యకర్తలతో వర్క్‌షాప్

జనసేనలో స్పీకర్స్‌, కంటెంట్‌ రైటర్స్‌, అనలిస్టులు, సమన్వయకర్తలుగా పనిచేయడానికి ముందుకు వచ్చిన వారిలో తొలుత మహిళలు, సీనియర్‌ సిటిజన్స్‌కు ఒక వర్క్‌షాప్‌ నిర్వహించాలని నిర్ణయించారు.

టార్గెట్ 2019: అనంతపురంలో జనసేన ఆఫీస్, టిడిపికి చెక్ పెట్టే ప్లాన్ ఇదే

క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి

క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి

రెండు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇందులో భాగంగానే అవసరమైన అన్ని చర్యలు తీసుకొంటున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు.2019 ఎన్నికల కోసం ఇప్పటి నుండి అన్ని నియోజకవర్గాల్లో సమస్యలను ఇతరత్రా సమాచారాన్ని జనసేన సేకరిస్తోంది.2019 ఎన్నికల్లో పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు వీలుగా యంత్రాంగాన్ని సమకూర్చుకొంటున్నారు పవన్ కళ్యాణ్

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jana sena chief Pawan Kalyan took Janasena membership on Sunday at party office in Hyderabad.Pawan kalyan meeting with party key leaders at party office.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి