"మా ఎమ్మెల్యేను కాదు, మీ బామ్మర్దిని ప్రశ్నించండి?"-చంద్రబాబుకు జనసేన నేత ప్రశ్న..!

ఏపీ రాజకీయాల్లో రెండున్నరేళ్లుగా కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన మధ్య గ్యాప్ పెరుగుతోందన్న చర్చ నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కేబినెట్ భేటీలకు రావడం లేదు. అలాగే ముఖ్యమంత్రి పాల్గొంటున్న కార్యక్రమాల్లో కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా నరసాపురం వెళ్లిన సీఎం చంద్రబాబు (Chandrababu).. స్థానిక జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ (Bommidi Nayakar) పనితీరుపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.

AP Local Polls: ఏపీ సర్కార్ కు మరో ఊరట- హైకోర్టు కీలక తీర్పు..!
AP Local Polls: ఏపీ సర్కార్ కు మరో ఊరట- హైకోర్టు కీలక తీర్పు..!

"పనితీరు బాగోలేదు. మీరు, నియోజకవర్గ అధికారులు సక్రమంగా పనిచేయడం లేదు. జిల్లా మొత్తం పనితీరు బాగానే ఉంది, కానీ మీ నియోజకవర్గం మాత్రం బాగోలేదు. దాదాపు అన్ని అంశాల్లోనూ మీరు మైనస్‌లో ఉన్నారు. 25 సూచికల్లో 23 ప్రతికూలంగా ఉన్నాయి. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఎమ్మెల్యేగా మీరు తప్పనిసరిగా పనిచేయాలి. నరసాపురం నియోజకవర్గం వెనుకబడిపోయింది. సమస్యలను నా దగ్గరకు తీసుకురావడం మాత్రమే కాకుండా, ప్రజల సహకారంతో వాటిని మీరే పరిష్కరించాలి. నోడల్ అధికారిని మార్చి, చురుకుగా పనిచేసే అధికారిని నియమించండి." అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Jana Sena Leader Bolisetty Satyanarayana Hits Back at Chandrababu Says Question Brother-in-Law First
జనసేన ఎమ్మెల్యేకు చంద్రబాబు ఊహించని షాక్-
జనసేన ఎమ్మెల్యేకు చంద్రబాబు ఊహించని షాక్-

దీంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఇబ్బందిపడుతూ కనిపించారు. ఈ ఘటనపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ (Bolisetty Satyanarayana) ఘాటుగా స్పందించారు. ఒక ఎమ్మెల్యే పనితీరును ప్రజల సమక్షంలో బహిరంగంగా ప్రశ్నించడం చాలా మంచి ప్రజాస్వామ్య సంప్రదాయమే అయితే, ఇలాంటి మంచి సంప్రదాయాన్ని ముందుగా తన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నియోజకవర్గంలోనో, లేదా దెందులూరు నియోజకవర్గంలో తాను ఏరికోరి తీసుకొచ్చిన తనకు అత్యంత ప్రీతిపాత్రుడైన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నియోజకవర్గంలోనో ప్రారంభించి ఉంటే మరింత సమంజసంగా ఉండేదని నా అభిప్రాయం అని ట్వీట్ చేశారు. ప్రజల ముందు ఎమ్మెల్యేల పనితీరుపై ప్రశ్నించే ఈ మంచి సంప్రదాయం అందరికీ సమానంగా వర్తిస్తేనే దానికి నిజమైన విలువ ఉంటుంది, కూటమికి మంచి జరుగుతుందని చురకలు అంటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+