జనసేన ఎంపికలు: ఒక్కో పార్లమెంటు నియోజకవర్గానికి 20 మంది

Posted By:
Subscribe to Oneindia Telugu

ప్రకాశం: ఒంగోలు నగరంలో జనసేన పార్లమెంటు నియోజకవర్గాలకు ఇంచార్జుల ఎంపిక ప్రక్రియ సోమవారం జరిగింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు దీనిని నిర్వహించారు.

మీడియా హెడ్‌ హరిప్రసాద్‌‌తో పాటు పలువురు ఒంగోలులో సమన్వయకర్తల ఎంపికకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఔత్సాహికులైన యువతీ, యువకులు హాజరయ్యారు.

Jana Sena selections: 20 members from each constituency

ఈ సందర్భంగా హరిప్రసాద్‌ మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లోని 42 పార్లమెంటు స్థానాల్లో పార్టీ ఇంచార్జుల ఎంపిక జరుగుతోందన్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 20 మందిని ఎంపిక చేస్తామన్నారు.

జాబితాను పవన్ కళ్యాణ్‌కు అందజేస్తామని, డిసెంబరు మూడో వారంలో వివరాలు ప్రకటిస్తారన్నారు. వారికి హైదరాబాద్‌లో శిక్షణ ఇస్తారన్నారు. మొత్తం 840 మంది సమన్వయకర్తలను ఎంపిక చేస్తామన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
20 members from each Lok Sabha constituencies in Andhra Pradesh and Telangana.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి