బాబుకు బంపర్ ఆఫర్! ఉచితంగా... అమరావతిలో బిల్డింగ్ నిర్మిస్తామని జనచైతన్య
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భారీ భవనాన్ని నిర్మించేందుకు జన చైతన్య గ్రూప్ ముందుకు వచ్చింది. జన చైతన్య సంస్థ ఛైర్మన్ మాదాల చైతన్య మంగళవారం నాడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును విజయవాడలో కలిశారు.
తన తల్లి శకుంతల పేరిట 25వేల అడుగుల విస్తీర్ణం గల భవంతిని ఉచితంగా నిర్మించి ఇస్తామని చంద్రబాబుకు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు ముందుకొచ్చిన జన చైతన్య గ్రూప్ ఛైర్మన్‌ను చంద్రబాబు అభినందించారు.
రాయలసీమ జిల్లాలపై లోకేష్ దృష్టి
ప్రతిపక్షం వైయస్సార్ కాంగ్రెస్ గట్టి పట్టున్న రాయలసీమ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ పటిష్టత పైన ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ దృష్టి సారించారు. సోమవారం నుంచి నేరుగా రంగంలోకి దిగిన ఆయన పార్టీ ఏపీ శాఖ ప్రధాన కార్యదర్శులకు ఆయా జిల్లాల బాధ్యతలను అప్పగించారు.

మంగళవారం ఉదయం పార్టీ ఉపాధ్యాయ విభాగం నేతలతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏపీలో ప్రత్యేకంగా రాయలసీమలో పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా దృష్టి సారించారు. మరోవైపు, వైసిపి అధినేత జగన్ టీడీపీకి గట్టి పట్టున్న ఆంధ్రలో తన పార్టీని బలోపేతం చేసుకునే దిశగా చర్యలు ప్రారంభించారు.
జగన్ మంగళవారం నాడు క్రితం ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో హైదరాబాదులో భేటీ అయ్యారు. ఆయా జిల్లాల్లో పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై ఆరా తీశారు. భవిష్యత్తులో ఆ జిల్లాల్లో పార్టీకి మరిన్ని సీట్లు వచ్చేలా చూసేందుకు ఎలాంటి వ్యూహం అవలంబించాలన్న అంశంపై ఆయన పార్టీ నేతల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు.












Click it and Unblock the Notifications