పవన్ లెక్క తప్పుతోందా - నమ్ముకున్న నేతల చూపు ఎటు..!!

ఏపీ ఎన్నికల రాజకీయం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. టిడిపి, జనసేన, బిజెపి మూడు పార్టీల కూటమి మధ్య సీట్ల ఖరారు దాదాపు ఫైనల్ అయింది. మూడు పార్టీలోనూ సీనియర్లకు కొంతమందికి సీట్లు తగ్గలేదు. జనసేన ఇప్పటివరకు 18 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. కానీ సామాజిక సమతుల్యత లోపించిందనే చర్చ మొదలైంది.

బీసీలకు రెండు స్థానాలు
కూటమి పొత్తుల లెక్కల్లో భాగంగా జనసేనకు 20 కు 21 అసెంబ్లీ రెండు ఎంపీ స్థానాలు ఖరారయ్యాయి. జనసేన ఇప్పటివరకు 18 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో కేవలం రెండు స్థానాలు మాత్రమే బీసీలకు కేటాయించటం ప్రత్యర్థులకు అష్టంగా మారింది. జనసేన ప్రకటించిన స్థానాల్లో 12 ఓసి లకు కేటాయించగా కేవలం అనకాపల్లి, నరసాపురం స్థానాలు మాత్రమే బీసీలకు ఖరారు చేశారు. ప్రధానంగా గోదావరి జిల్లాల్లో జనసేన కోసం ఐదేళ్ల కాలంగా పనిచేస్తున్న బీసీ నేతలకు ప్రాధాన్యత దక్కలేదంటూ విమర్శలు మొదలయ్యాయి.

Janansena announces candidates for 18 constituencies allotted only two seats for BC communities

సీనియర్లకు దక్కని సీట్లు
జనసేన కోసం చిత్తశుద్ధితో పనిచేసిన సీట్లు దక్కలేదంటూ కొందరు నేతలు వాపోతున్నారు. బొలిశెట్టి సత్యనారాయణ, కిరణ్ రాయల్, పసుపులేటి హరిప్రసాద్, పంచకర్ల సందీప్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పోతిన మహేష్, ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ వంటి నేతలు ఉన్నారు. ఏకంగా 12 స్థానాలు ఓసీలకు ఇవ్వడం.. ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఇవ్వటమేనన్న విశ్లేషణలు మొదలయ్యాయి. వైసిపి సామాజిక న్యాయం పేరుతో గోదావరి జిల్లాల్లో బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తుంటే జనసేన మాత్రం విశాఖలో ఒక స్థానం పశ్చిమగోదావరిలో ఒక స్థానం మాత్రమే బీసీలకు ఇప్పటివరకు కేటాయించింది.

Janansena announces candidates for 18 constituencies allotted only two seats for BC communities

పవన్ సక్సెస్ అయ్యేనా
గోదావరి జిల్లాలో కీలక ఉడ్డంగా ఉన్న శెట్టిబలిజ వర్గానికి ఇప్పటివరకు సీటు కేటాయించలేదు. కాకినాడ మాజీ మేయర్ పోతనపల్లె సరోజ జనసేన సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన పోటీ చేసే రెండు సీట్లలోనూ కొత్తగా పార్టీలో చేరిన వారికి టిక్కెట్లు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన ఒక్క మహిళకే అవకాశం ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. శెట్టిబలిజ వర్గానికి అవకాశం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన నుంచి మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+