వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ వార్నింగ్: ఢిల్లీ నుండి కాకినాడకు వస్తా: వెనుకడుగు వేస్తారనుకోవద్దు..!

|
Google Oneindia TeluguNews

కాకినాడలో జరుగుతన్న పరిణామాల మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి జనసేన అధినేత పవన్ పైన చేసిన వ్యాఖ్యల పట్ల జనసేన కార్యకర్తలు నిరసన కు దిగారు. ఆ సమయంలో వైసీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తల పైన దాడులకు దిగారు. దీని పైన ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ హెచ్చరికలు చేసారు. అరాచక శక్తులతో దాడి చేయిస్తే వెనకడుగు వేస్తారనుకోవద్దని స్పష్టం చేసారు. రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్న ఆ ప్రజా ప్రతినిధిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేసారు. ప్రతి జన సైనికుడు వారికి ధైర్యాన్ని అందించి అండగా నిలవాలని పవన్ పిలుపునిచ్చారు.

వెనుకడుగు వేసేది లేదు..
కాకినాడలో ఈ రోజు జరిగిన పరిణామాల మీద పవన్ స్పందించారు. సభ్య సమాజం ఛీత్కరించుకొనే పదజాలంతో ప్రసంగం చేసిన ప్రజా ప్రతినిధి తీరుపై నిరసన తెలియచేస్తున్న జనసేన కార్యకర్తలు, నాయకులపై వైసీపీ కార్యకర్తలు రాళ్ళ దాడికి పాల్పడటం అత్యంత దురదృష్టకరం గా అభివర్ణించారు. ప్రజలుఎన్నుకున్న ఒక ప్రజా ప్రతినిధి బాధ్యత లేకుండా అసభ్యకరంగా మాట్లాడిన విధం చూసిన ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారని పేర్కొన్నారు. తప్పుని తప్పు అని చెబుతున్నవారిపై అరాచక శక్తులతో దాడులు చేయిస్తే జన సైనికులు వెనకడుగు వేస్తారనుకోవద్దని హెచ్చరించారు. అధర్మాన్ని ఖండించడమే జనసేన విధానమని చెప్పుకొచ్చారు. రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్న ఆ ప్రజా ప్రతినిధిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని పవన్ డిమాండ్ చేసారు.

Janasean Chief Pawan Kalyan warned Kakinada YCP leaders

నేరుగా కాకినాడకు వస్తాను
జిల్లా పోలీసు యంత్రాంగాన్ని కోరేది ఒకటేనని.. పక్షపాతం లేకుండా ఇరు వర్గాలతో చర్చించి శాంతియుత పరిస్థితులు తీసుకురావాలని పవన్ కళ్యాణ్ కోరారు. జనసేన కార్యకర్తలకు, నాయకులకు అన్యాయం చేసి ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తే ఢిల్లీ పర్యటన నుంచి నేరుగా కాకినాడకు వచ్చి వారికి బాసటగా ఉంటానని స్పష్టం చేసారు. రాళ్ళ దాడిలో గాయపడిన జన సైనికులు, నాయకులు త్వరగా కోలుకోవాలని పవన్ ఆకాంక్షించారు. ప్రతి జన సైనికుడు వారికి ధైర్యాన్ని అందించి అండగా నిలవాలని సూచించారు. తమ పార్టీ కార్యకర్తల మీద వైసీపీ కార్యకర్తలు దాడులు చేసారని వారి మీద చర్యలు తీసుకోవాలంటూ తూర్పు గోదావరి జిల్లా జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు.

English summary
Janasena Chief Pawan Kalyan warned YCP leades that if attacks not stopped he come to Kakinada directly from Delhi. He asked the police to take action agaist Local Mla on his abusing language.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X