pawan kalyan: జనసేన-బీజేపీ కలిసే స్థానిక సంస్థల్లో పోటీ, 12న మేనిఫెస్టో..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ-జనసేన వ్యుహారచన చేస్తున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సహా మున్సిపల్ ఎన్నికలు జరగబోతుండటంతో.. పొత్తుల ఎత్తులపై సమాలోచనలు చేశాయి. బీజేపీ చీఫ్ జేడీ నడ్డాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుక్రవారం సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులపై ప్రధానంగా డిస్కషన్ జరిగింది.

 janasena bjp duo contest local body elections..

శుక్రవారం రాత్రి జేపీ నడ్డా విందు ఇచ్చారు. పవన్ కల్యాణ్ సహా నాదెండ్ల మనోహర్, జీవీఎల్ నర్సింహారావు ప్రభృతులు సమావేవంలో పాల్గొన్నారు. ఎన్ని స్థానాలపై పోటీ చేయాలి, ఎలా ముందెళ్లాలనే అంశంపై డిస్కస్ చేసినట్టు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో తమ కార్యాచరణ ఎలా ఉండబోతుందనే అంశంపై మీడియాకు క్లుప్తంగా మనోహర్ వివరించారు. ఇప్పటికే ఇరు పార్టీ నేతలతో టెలీ కాన్పరెన్స్ నిర్వహించినట్టు వివరించారు.

ఈ నెల 8వ తేదీన విజయవాడలో జిల్లాల నుంచి ఇరుపార్టీల నేతలను పిలిచి.. పొత్తుపై మాట్లాడతామని పేర్కొన్నారు. అలా అందరి అభిప్రాయం తీసుకొని.. ముందుకెళ్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత 12వ తేదీన మేనిఫెస్టో విడుదల చేస్తామని చెప్పారు. స్థానిక సంస్థల తమ పోరాటం జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైనే అని మనోహర్ స్పష్టంచేశారు.

Recommended Video

    AP Local Body Polls : Watch TDP Leaders Met State Election Commissioner | Oneindia Telugu

    ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఈ నెల 21, 24 తేదీల్లోనూ, మున్సిపల్ ఎన్నికలను ఈ నెల 27న నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదలైంది. శనివారం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+