నేడు జనసేన ఛలో విస్సన్నపేట: మంత్రి గుడివాడ అమర్నాథ్ టార్గెట్ గా.. పోలీసులు అలెర్ట్!!
జనసేన నేడు చలో విస్సన్నపేట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 600 ఎకరాల భూకబ్జాను నిరూపిస్తామని, మంత్రి అమర్‌నాథ్ రాజీనామా చేయాలని పవన్ కల్యాణ్ పార్టీ నేతలు చెప్పడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యార
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన, ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మధ్య గత కొద్దిరోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అనకాపల్లి నియోజకవర్గం కాసింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధి సర్వేనెంబర్ 195/2 లో ఏపీ మంత్రి అమర్నాథ్ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి కబ్జాలకు పాల్పడ్డారని జనసేన పార్టీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. మంత్రి 600 ఎకరాల భూములను కబ్జాలు చేశారని.. ఇక యువకులు మాత్రం 5000 రూపాయలకే ఉద్యోగాలు చేయాలంటూ చెబుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గుడివాడ అమర్నాథ్ ను టార్గెట్ చేశారు.

మంత్రి అమర్నాథ్ సవాల్ కు సై అన్న జనసేన
ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, అలాగే జనసేన పార్టీ నేతలు చేసిన ఆరోపణలపై మండిపడిన గుడివాడ అమర్నాథ్ జనసేన పార్టీ అధినేతకు బహిరంగ సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ తనపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. తన వద్ద 600 ఎకరాలు ఉన్నట్టు నిరూపిస్తే ఆ భూమిని జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చేస్తానని, ఏ పేపర్ పై సంతకం పెట్టాలో చెబితే పెడతానని, మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. ఇక తాము కూడా తగ్గేది లేదని సవాల్ కు సై అన్నారు జనసేన నాయకులు.

నేడు ఛలో విస్సన్నపేట.. మంత్రి భూ కబ్జాలు నిరూపిస్తామంటున్న జనసైనికులు
ఇక గుడివాడ అమర్నాథ్ చేసిన సవాల్ ను స్వీకరించిన జనసేన పార్టీ నేతలు ఛలో విస్సన్నపేట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గుడివాడ అమర్నాథ్ చేసిన కబ్జాలను నిరూపిస్తామని వారు గట్టిగా చెబుతున్నారు. ఈ మేరకు నేడు ఛలో విస్సన్నపేటకు బయలుదేరారు జనసేన పార్టీ నేతలు. ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నేడు అనకాపల్లి పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి వెళ్లి విసన్నపేటలో నిజనిర్ధారణ కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన చేయనుందని, 600 ఎకరాల భూమిని మంత్రి కబ్జా చేసినట్టుగా నిరూపిస్తామని జనసేన పార్టీ నేతలు చెబుతున్నారు.

మంత్రి అమర్నాథ్ రాజీనామాకు సిద్ధంగా ఉండాలన్న జనసేన .. పోలీసులు అలెర్ట్
మంత్రి గుడివాడ అమర్నాథ్ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలని వారు ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం విస్సన్నపేటకు జనసేన పార్టీ నేతలు వెళ్ళనున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. ఒకపక్క రాజకీయ విమర్శలు, మరొక జనసేన పార్టీ ఛలో విస్సన్నపేట కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు నేతల కదలికలపై నిఘా పెట్టారు. ఇక నేడు జనసేన ఛలో విస్సన్నపేట నేపధ్యంలో స్థానికంగా టెన్షన్ చోటు చేసుకుంది. వైసీపీ వర్సెస్ జనసేన పోరు ఏ టర్న్ తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.
-
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
1,01,001 బియ్యపు గింజలపై "రామ" నామం..! -
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
వీళ్లా ఆలయ అధికారులు.. శ్రీరామనవమి నాడే "అశ్లీల నృత్యాల" బాగోతం !! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications