పవన్ కల్యాణ్ వర్సస్ మంత్రి అంబటి - మరో వార్ షురూ..!!
జనసేనాని పవన్ వర్సస్ మంత్రి అంబటి మధ్య ట్విట్టర్ వార్ మొదలైంది. రాజకీయంగా కొంత కాలంగా ఇద్దరూ ఒకరి పైన మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ సీఎం జగన్ లక్ష్యంగా చేసే విమర్శలకు అంబటి కౌంటర్ ఇవ్వటం..జనసేన కౌంటర్ ఎటాక్ చేయటం పరిపాటిగా మారింది. ఇప్పుడు పవన్ కల్యాణ్ వైసీపీ నేతలను ఉద్దేశించి ఒక ట్వీట్ చేసారు. దీని పైన స్పందిస్తూ మంత్రి అంబటి మరో ట్వీట్ చేసారు. ఈ ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి లక్ష్యమని ఇప్పటికే పవన్ కల్యాణ్ ప్రకటించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని శపథం చేసారు. టీడీపీతో పాటుగా బీజేపీతోనూ పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పొత్తులు ఉంటాయని తేల్చి చెప్పారు. పవన్ టీడీపీతో పొత్తుల వ్యవహారం పైన మంత్రి అంబటి సీరియస్ గా స్పందించారు. ఇప్పుడు పవన్ తమ పార్టీ పరిస్థితులు..సీట్ల పైన సర్వేలు చేయిస్తున్నారు. తమ పార్టీ ఓటింగ్ శాతం పైన తాజాగా కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి లక్ష్యంగా ఇప్పుడు పవన్ సెటైరికల్ ట్వీట్ చేసారు. నియంతలతో యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది అని ఓ కార్టున్ ఫోటోను షేర్ చేశారు.

పవన్ చేసిన ట్వీట్ లో ముఖ్యమంత్రి జగన్ ను పల్లకిలో వైసీపీ నాయకులు, అధికారులు మోసుకెళ్లడం కనిపిస్తుంది. దాని పక్కనే "కొత్త దేవుడండి, కొంగ్రొత్త దేవుడండి, ఇతడే దిక్కని మొక్కపోతే దిక్కుమొక్కు లేదండండి" అంటూ క్యాప్షన్ జత చేసారు. దీని పైన మంత్రి అంబటి స్పందించారు. దీనికి కౌంటర్ గా మరో ట్వీట్ చేసారు. అందులో మా నాయకుడినే మోస్తాం ! ప్యాకేజి కోసం పక్క నాయకుడిని కాదు ..! అంటూ సమాధానం ఇచ్చారు. దీనిని వైసీపీ శ్రేణులు ఇప్పుడు షేర్ చేస్తున్నారు. అటు టీడీపీ మహానాడు జరగుతున్న వేళ వైసీపీ లక్ష్యంగా ఆరోపణలు ఎక్కుపెట్టారు. వీటిని మంత్రులు కౌంటర్ చేస్తున్న సమయంలో ఇప్పుడు పవన్ వర్సస్ మంత్రి అంబటి ట్వీట్ల వార్ వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications